ఇటీవల కాలంలో అవకాశాలపరంగా త్రిష రేసులో వెనుకబడిపోయింది. ఇక కెరియర్ గాడలో పడే అవకాశాలు లేవనే త్రిష పెళ్లికి సిద్ధమయ్యాయనే విమర్శలు వినిపించాయి. అయితే ఆమె కెరియర్‌ను చక్కదిద్దే బాధ్యతను త్రిషకు కాబోయే భర్తను తీసుకున్నాడు. ఆమె ప్రముఖ తమిళ నిర్మాత వరుణ్‌మనియన్‌తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరిరువురికి నిశ్చితార్థం కూడా పూర్తికావడంతో ఇక త్రిష సినిమాలకు పూర్తిగా దూరమైనట్లేనని ఆమె అభిమానులు బాధపడ్డారు. అయితే పెళ్లి తర్వాత కూడా త్రిష సినిమాల్లో నటిస్తుందని, ప్రస్తుతం ఆమెతో తాను ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ నిర్మిస్తున్నట్లు వరుణ్‌మనియన్ ప్రకటించాడు. తిరు దర్శకత్వంలో జై హీరోగా నటించనున్న ఈ సినిమాలో త్రిష పల్లెటూరి యువతిగా కనిపించనుంది. ఇక ఈ సినిమా ఏప్రిల్‌లో పట్టాలెక్కనుంది. ప్రస్తుతం తెలుగులో 'లయన్' సినిమాలో నటిస్తోంది త్రిష.