ఐదేళ్ల క్రితం అక్షయ్‌కుమార్ బాలీవుడ్‌కు పెద్దదిక్కుగా ఉన్నారు. మిగిలిన స్టార్ హీరోలంతా పరాజయాల బాట పడితే అక్షయ్‌కుమార్ విజయాలతో బాలీవుడ్‌కు బాసటగా నిలిచాడు. అటు తర్వాత ఆయన్ను కొన్ని పరాజయాలు పలకరించినప్పటికీ పట్టువదలకుండా మళ్లీ విజయాల బాట పట్టాడు. ఇక తాజాగా ఆయన నటించిన 'బేబీ' చిత్రం కాసులవర్షం కురిపిస్తోంది.ఈ సినిమాలో రానా కూడా ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు ప్రకటించాడు ఆ సినిమా దర్శకుడు నీరజ్‌పాండే. ప్రస్తుతం భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని జీవితచరిత్రపై తీస్తున్న సినిమాతో బిజీగా ఉన్న నీరజ్ ఈ సినిమా పూర్తికాగానే 'బేబీ-2'ను పట్టాలెక్కిస్తానని చెప్పాడు. దీనికి అక్షయ్‌కుమార్, మిగిలిన నటీనటులు కూడా పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ఇక 'బేబీ-2'ను 2017 జనవరి 26న విడుదలకు సిద్ధం చేస్తానని కూడా నీరజ్ చెబుతుండటం గమనార్హం.