Advertisementt

‘తరువాత కథ’ ట్రైలర్స్‌ లాంచ్‌

Mon 09th Feb 2015 02:44 AM
taruvatha katha,archana,soni agarwal,vinod kumar,udayakumar jasti,prabhakaran  ‘తరువాత కథ’ ట్రైలర్స్‌ లాంచ్‌
‘తరువాత కథ’ ట్రైలర్స్‌ లాంచ్‌
Advertisement
Ads by CJ

అర్చ, సోనీ అగర్వాల్‌ సమీర్‌, వినోద్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో శ్రీ పద్మావతి ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఉదయభాస్కర్‌ జాస్తి సమర్పణలో ప్రభాకరన్‌ దర్శకత్వంలో ఆర్‌.పద్మజ నిర్మిస్తున్న హార్రర్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘తరువాత కథ’.  ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్స్‌ లాంచ్‌ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్‌, బి.గోపాల్‌, కరీంనగర్‌ ఎడిషనల్‌ ఎస్‌.పి. సుబ్బారాయుడు ట్రైలర్స్‌ను లాంచ్‌ చేయగా, భీమనేని శ్రీనివాసరావు టి.వి. ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు శివాజీరాజా, రాహుల్‌, రాకెట్‌ రాఘవ, జైసింహ, హీరోయిన్లు, ప్రియ, నక్షత్ర, హరిత, ఉమ, దర్శకుడు ప్రభాకరన్‌, నిర్మాత ఆర్‌. పద్మజ, చిత్ర సమర్పకుడు, సినిమాటోగ్రాఫర్‌ ఉదయభాస్కర్‌ జాస్తి, సంగీత దర్శకుడు తారకరామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

బి.గోపాల్‌: నేను రాఘవేంద్రరావుగారి శిష్యుడ్ని, ఉదయభాస్కర్‌ ప్రకాష్‌ శిష్యుడు. ఒక మంచి చిత్రాన్ని నిర్మిస్తూ చాలా మంది కొత్తవారికి అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.

వి.వి.వినాయక్‌: ప్రభాకర్‌, నేను అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌గా పనిచేశాం. ప్రభాకర్‌కి ఉదయభాస్కర్‌గారు డైరెక్టర్‌గా ఛాన్స్‌ ఇచ్చారు. అతనికి డైరెక్టర్‌గా బ్రేక్‌ రావాలని, ఉదయభాస్కర్‌గారికి ఈ సినిమా ద్వారా డబ్బులు వస్తాయని ఆశిస్తున్నాను.

భీమనేని శ్రీనివాసరావు: మహీధర్‌గారి దగ్గర ఆపరేటివ్‌ కెమెరామెన్‌గా పనిచేశారు ఉదయభాస్కర్‌. వాళ్ళిద్దరూ నా సినిమాలకు పనిచేశారు. ఉదయభాస్కర్‌ది చాలా సాఫ్ట్‌ నేచర్‌. సుప్రభాతం చిత్రంతో అతన్ని కెమెరామెన్‌గా పరిచయం చేశాను. ఈ సినిమా మీద ఎంతో మంది భవిష్యత్తు ఆధారపడి వుంది. ఇలాంటి చిన్న సినిమాలు బాగా ఆడకపోయినా నిర్మాత నష్టపోకుండా సేఫ్‌ అయితే ఇంకా మంచి సినిమాలు తీసే అవకాశం వుంటుంది. కాబట్టి ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. 

ప్రభాకరన్‌: నా మొదటి సినిమా రామ్‌గోపాల్‌వర్మ. ఉదయభాస్కర్‌గారు ఒక మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చారు. త్వరలో మా కాంబినేషన్‌లో మరో సినిమా చెయ్యబోతున్నాం. హార్రర్‌ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి సక్సెస్‌ చేస్తారని ఆశిస్తున్నాను.

అర్చన, సోని అగర్వాల్‌, సమీర్‌, వినోద్‌కుమార్‌, శివాజీరాజా, రవిప్రకాష్‌, సత్యకృష్ణన్‌, జైసింహ, హరిత, పవన్‌, వెంకట్‌, రాహుల్‌, భగవాన్‌, సందీప్తి, ప్రియాంక, విష్ణుప్రియ, లత, ఉమ, రాకెట్‌ రాఘవ, అదిరే అభి, ప్రియ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తారకరామారావు, సినిమాటోగ్రఫీ: ఉదయభాస్కర్‌ జాస్తి, ఎడిటింగ్‌: రమేష్‌, ఆర్ట్‌: శ్రీనివాసరాజు, మాటలు: పార్వతీచంద్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: నసిపూడి చక్రవర్తి, సమర్పణ: ఉదయభాస్కర్‌ జాస్తి, నిర్మాత: ఆర్‌.పద్మజ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రభాకరన్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ