Advertisementt

తనకింకా నిశ్చితార్థం కాలేదంటున్న స్టార్‌ హీరో..!!

Mon 09th Feb 2015 08:47 AM
ranabeer kapoor,katrina kaif,engagement,marriage,thamasha  తనకింకా నిశ్చితార్థం కాలేదంటున్న స్టార్‌ హీరో..!!
తనకింకా నిశ్చితార్థం కాలేదంటున్న స్టార్‌ హీరో..!!
Advertisement
Ads by CJ

కత్రినాకైఫ్‌, రణబీర్‌కపూర్‌ బాలీవుడ్‌ మీడియాకు కావాల్సినంత మసాలా అందిస్తున్నారు. ఈ జంట ఎక్కడ  ఉన్నా మీడియాకు పండగే. ఇక వీరి నిశ్చితార్థం జరిగిపోయిందంటూ.. అప్పుడే కలిసి కాపురం కూడా చేస్తున్నారంటూ మీడియా కోడై కూస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై రణబీర్‌కపూర్‌ స్పందించారు. తనకు ఇంకా కత్రినాకైఫ్‌తో నిశ్చితార్థం జరగలేదని ఆయన ఓ ప్రకటనలో మీడియాకు స్పష్టం చేశారు. ఇటీవలె ఈ జంట సన్నిహితుల నడుమ లండన్‌లో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఇటీవలే మీడియాలో వార్తలు వచ్చాయి. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. తాను ఇంకా పెళ్లికి సిద్ధం కాలేదని, అలాంటిదేమైనా ఉంటే ముందు మీడియాకే చెబుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో 'తమాషా' చిత్రంలో రణబీర్‌ నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'రాక్‌స్టార్‌' బాలీవుడ్‌ బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఇక 'తమాషా'పై కూడా సినీ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ