Advertisementt

నాగార్జున, కార్తీ హీరోలుగా పి.వి.పి. చిత్రం ప్రారంభం

Wed 11th Feb 2015 08:53 AM
hero nagarjuna,hero karthi,pvp cinema,vamsi paidipally,sruthi haasan,gopisunder  నాగార్జున, కార్తీ హీరోలుగా పి.వి.పి. చిత్రం ప్రారంభం
నాగార్జున, కార్తీ హీరోలుగా పి.వి.పి. చిత్రం ప్రారంభం
Advertisement
Ads by CJ

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ హీరోలుగా సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ పి.వి.పి. పతాకంపై మున్నా, బృందావనం, ఎవడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ప్రసాద్‌ వి. పొట్లూరి ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ బుధవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. 

నాగార్జున, కార్తీలపై చిత్రీకరించిన తొలి షాట్‌కి అమల నాగార్జున క్లాప్‌నివ్వగా, పివిపి సతీమణి శ్రీమతి రaాన్సీ సురెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఫస్ట్‌ షాట్‌ను వంశీ పైడిపల్లి సతీమణి శ్రీమతి మాలిని పైడిపల్లి డైరెక్ట్‌ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి సబంధించిన తమిళ వెర్షన్‌ ప్రారంభోత్సవం ఫిబ్రవరి 28న చెన్నైలో గ్రాండ్‌గా జరగనుంది. 

ఈ సందర్భంగా కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ ‘‘వంశీ ఈ కథ చెప్పగానే చాలా ఎక్సైట్‌ అయ్యాను. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చేస్తానా అనే క్యూరియాసిటీ నాలో కలిగింది. ఈమధ్యకాలంలో నేను విన్న మంచి సబ్జెక్ట్‌ ఇది. డెఫినెట్‌గా ఇది డిఫరెంట్‌ మల్టీస్టారర్‌ అవుతుంది. ఈ చిత్రాన్ని పి.వి.పి. చాలా హై లెవల్‌లో ప్లాన్‌ చేశారు. చాలా కాలం తర్వాత తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని నిర్మించడం విశేషం’’ అన్నారు.

కార్తీ మాట్లాడుతూ ‘‘నేను తమిళ్‌లో చేసిన సినిమాలన్నీ తెలుగులో కూడా పెద్ద హిట్‌ అయ్యాయి. నేను ఫస్ట్‌ టైమ్‌ తెలుగులో చేస్తున్న స్ట్రెయిట్‌ మూవీ తమిళ్‌లో కూడా నిర్మించడం హ్యాపీగా వుంది. తెలుగులో నా ఫస్ట్‌ మూవీ నాగార్జునగారులాంటి పెద్ద హీరోతో, పివిపి లాంటి పెద్ద సంస్థలో చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా తప్పకుండా తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది’’ అన్నారు.

సంగీత దర్శకుడు గోపిసుందర్‌ మాట్లాడుతూ ‘‘బెంగుళూర్‌ డేస్‌ చిత్రాన్ని పివిపిగారు రైట్స్‌ తీసుకొని ఆ చిత్రంలోని మ్యూజిక్‌ ఆయనకు బాగా నచ్చడంతో తెలుగులో కూడా సంగీతం చేసే అవకాశం నాకే ఇచ్చారు. ఈమధ్య విడుదలైన మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు నాకు చాలా మంచి పేరు తెచ్చింది. నాగార్జునగారు, కార్తీగారు చేస్తున్న ఈ సినిమాతో తెలుగులో కూడా నాకు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నాను’’ అన్నారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘‘నాగార్జునగారు, కార్తీగారు ఈ సినిమా చేయడానికి అంగీకరించడమే సగం విజయం లభించినట్టు ఫీల్‌ అవుతున్నాను. ఈ కథకు నాగార్జునగారు, కార్తీగారు హండ్రెడ్‌ పర్సెంట్‌ పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతారు. నాగార్జునగారితో నేను చేస్తున్న తొలి సినిమా ఇది. అలాగే కార్తీగారు ఫస్ట్‌ టైమ్‌ తెలుగులో చేస్తున్న స్ట్రెయిట్‌ మూవీకి నేను దర్శకత్వం వహించడం హ్యాపీగా వుంది. నామీద నమ్మకంతో చిత్రం ద్వారా తమిళ్‌లో నన్ను డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్‌ చేస్తున్న పివిపిగారికి థన్యవాదాలు. పివిపిలాంటి పెద్ద సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందన్న నమ్మకం నాకు వుంది’’ అన్నారు. 

మార్చి 16 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకునే ఈ చిత్రం జూన్‌ నెలాఖరుకు పూర్తవుతుంది. హైదరాబాద్‌, చెన్నైలతోపాటు విదేశాలలో కూడా ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది. 

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, శృతిహాసన్‌, జయసుధ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ఇంకా చాలా మంది ప్రముఖ నటీనటులు ఇతర పాత్రలు పోషిస్తారు. ‘మనం’లాంటి సూపర్‌హిట్‌ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన పి.ఎస్‌.వినోద్‌ ఈ చిత్రానికి కూడా ఫోటోగ్రఫీ చేస్తున్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: గోపిసుందర్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, మాటలు: అబ్బూరి రవి, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్‌, ఎడిటింగ్‌: శ్రీకరప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, నిర్మాత: ప్రసాద్‌ వి.పొట్లూరి, స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: వంశీ పైడిపల్లి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ