ప్రమోషనల్ కార్యక్రమాలను డిఫరెంట్ గా చేస్తున్న ‘బందిపోటు’ యూనిట్
ఇవివి సినిమా బ్యానర్ పై అల్లరి నరేష్, ఈషా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ’బందిపోటు‘. ఇప్పటి వరకు డిఫరెంట్ కామెడితో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన టాలీవుడ్ కామెడి హీరో అల్లరి నరేష్ రాబిన్ హుడ్ తరహా కథాంశంతో ‘దొంగల్ని దోచుకో’ అనే కాన్సెప్ట్ తో మరోసారి నవ్వులు విరబూయించనున్నారు. ‘అష్టాచమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘అంతకు ముందు...ఆ తర్వాత’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను తెరకెక్కించిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రాజేష్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. కల్యాణ్ కోడూరి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలై మంచి సక్సెస్ అయింది. ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈ ఫిబ్రవరి 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. అందులో భాగంగా సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులను చిత్రయూనిట్ కలవబోతున్నారు. ఈ కార్యక్రమంలో హీరో అల్లరి నరేష్, హీరోయిన్ ఈషా, అవసరాల శ్రీనివాస్, సంపూర్ణేష్ బాబు, డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి, సంగీత దర్శకుడు కల్యాణ్ కోడూరి, ఆర్యన్ రాజేష్ సహా చిత్రయూనిట్ పాల్గొననున్నారు. ఈ టూర్ ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ప్రారంభం అవుతుంది. షో టైమ్ ఈవెంట్స్ వారు ఈ టూర్ ను అర్గనైజ్ చేస్తున్నారు.
ప్రమోషనల్ టూర్ వివరాలు:
14 ఫిబ్రవరి
ఉదయం 11 గంటలకు రాజమండ్రి కళా మందిర్
మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ శ్రీనికేతన్ షాపింగ్ మాల్
సాయంత్రం 6 గంటలకు వైజాగ్ సి.ఎం.ఆర్ మాల్
రాత్రి 8 గంటలకు వైజాగ్ పార్క్ హోటల్ వెలంటెన్స డే ఈవెంట్ లో చిత్రయూనిట్ పాల్గొంటుంది.
15 ఫిబ్రవరి
ఉదయం 11 గంటలకు గుంటూరు ఇవివి కళావాహిని
మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడు కళామందిర్
సాయంత్రం 6 గంటలకు విజయవాడ కళావాహినిలో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ వేడుకలో చిత్రయూనిట్ పాల్గొన్ననున్నారు.