మంచు లక్ష్మి, అడవి శేషులు ప్రధా పాత్రల్లో నటిస్తున్న సినిమాకు టైటిల్ ఖరారైంది. కామెడీ థ్రిల్లర్‌గా వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు 'దొంగాట' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మంచులక్ష్మి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మంచు ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బ్యానర్‌పై మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరో కూడా అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మలుపు తిప్పే క్యారెక్టర్‌లో నటింపజేయడానికి పలువురు ప్రముఖ హీరోల పేర్లను పరిశీలించిన సినిమా యూనిట్ దగ్గుపాటి రానాను సంప్రదించినట్లు సమాచారం. ఇక కథ విన్న రానా వెంటనే ఓకే చెప్పడంతో ఆయన ఈ సినిమాలో భాగంగా మారారు. ఇప్పటికే ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.