సెలబ్రెటీల పేర్లమీద సోషల్ మీడియాలో ఎకౌంట్లు ఓపెన్ చేసి మోసాలు చేయడం ఇప్పుడు పరిపాటిగా మారింది. ఇలాగే ఓ యువకుడు అక్కినేని అఖిల్ పేరిట మోసం చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్‌అయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన అభినవ్ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో అఖిల్ పేరిట ఎకౌంటు ఓపెన్ చేశాడు. ఇక అందర్ని నమ్మించడానికి అమల, అఖిల్, నాగార్జునలకు సంబంధించిన కొన్ని ఫొటోలను అప్‌లోడ్ చేశాడు. ఆ తర్వాత అమ్మాయిలతో చాటింగ్ మొదలుపెట్టి వారిని ట్రాప్‌లోకి దింపి తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమున్నాయంటూ మోసాలు చేయడం ప్రారంభించాడు. దీనిపై అనుమానం వచ్చిన ఓ యువతి తన సోదరుడితో కలిసి అతణ్ని పోలీసులకు పట్టించింది. దీంతో అతడి మోసం అందరికీ తెలియవచ్చింది. లేకపోతే మరెంత మంది ఈ ఫేక్ అఖిల్ ట్రాప్‌లో పడి మోసపోయేవారో...??