ఏమాయ చేసావె, 100% లవ్, తడాఖా, మనం వంటి సూపర్‌హిట్ చిత్రాల హీరో యువసామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా, 1 నేనొక్కడినే ఫేం కృతి సనన్ హీరోయిన్‌గా, స్వామిరారా వంటి సూపర్‌హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్‌వర్మ దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్‌ని నిర్మించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రిలయన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రానికి ‘దోచేయ్’ అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించిన లోగోను, స్టిల్‌ను మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న విడుదల చేశారు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘అత్తారింటికి దారేది తర్వాత మా బేనర్‌లో స్వామిరారా టెక్నీషియన్స్‌తో చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి ‘దోచేయ్’ అనే టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అవుతుంది. అందుకే ఈ టైటిల్‌ని కన్‌ఫర్మ్ చేశాం. సుధీర్‌వర్మ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రెండు పాటలు మినహా టోటల్‌గా షూటింగ్ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి చివరి వారంలో చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలన్నది మా ప్లాన్. మా బేనర్‌లో అత్తారింటి దారేది చిత్రం తర్వాత మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది. అలాగే నాగచైతన్య కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా ఈ చిత్రం నిలుస్తుంది.
యువసామ్రాట్ నాగచైతన్య సరసన కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్., సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్: నారాయణరెడ్డి, కో`ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.