Advertisementt

'అనేకుడు' వారం వాయిదా పడ్డాడు..!!

Thu 19th Feb 2015 05:16 AM
anekudu,postpone,release on 27,dhanush  'అనేకుడు' వారం వాయిదా పడ్డాడు..!!
'అనేకుడు' వారం వాయిదా పడ్డాడు..!!
Advertisement
Ads by CJ

తమిళ్‌ హీరో ధనుష్‌ కూడా తన మామ రజినీ బాటలోనే పయనిస్తున్నారు. రజినీకాంత్‌కు దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు హిందీలో కూడా మంచి మార్కెట్‌ ఉంది. కెరియర్‌ మంచి ఊపులో ఉన్నప్పుడే ఆయన అన్ని భాషల్లోనూ నటించి ఎక్కడికక్కడ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు ధనుష్‌ కూడా అటు హిందీతోపాటు ఇటు దక్షిణ భారతంలోని అన్ని భాషలపై దృష్టికేంద్రీకరిస్తున్నారు. అందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా తన 'అనేకుడు' సినిమా కోసం తెలుగులో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా మొదట ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా విడుదలను మారో వారంపాటు వాయిదా వేశారు. 20న కాకుండా ఫిబ్రవరి 27న సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. అనివార్య కారణాలరీత్యా 'అనేకుడు'ను వారం వాయిదా వేశారని, కాని 27న మాత్రం కచ్చితంగా ఈ సినిమా విడుదలవుతుందని సినిమా యూనిట్‌ చెబుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ