Advertisementt

‘రామ్‌లీల’ ఆడియో సక్సెస్‌మీట్‌

Mon 23rd Feb 2015 04:55 AM
telugu movie ramleela,ramleela on 27th feb,hero havish,producer dasari kiran kumar,heroine nanditha  ‘రామ్‌లీల’ ఆడియో సక్సెస్‌మీట్‌
‘రామ్‌లీల’ ఆడియో సక్సెస్‌మీట్‌
Advertisement
Ads by CJ

హవీష్‌ హీరోగా కోనేరు సత్యనారాయణ సమర్పణలో, లంకాల బుచ్చిరెడ్డి సారధ్యంలో రామదూత క్రియేషన్స్‌ పతాకంపై శ్రీపురం కిరణ్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘రామ్‌లీల’. చిన్నా సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై సూపర్‌ సక్సెస్‌ అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్‌ బంజారా హోటల్‌లో చిత్ర యూనిట్‌ ఆడియో సక్సెస్‌ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా॥ పరుచూరి గోపాలకృష్ణ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ఆడియో సక్సెస్‌ షీల్డులను యూనిట్‌ సభ్యులకు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో హవీష్‌, హీరోయిన్‌ నందిత, మరో హీరోయిన్‌ మదాలస శర్మ, చిత్ర సమర్పకులు కోనేరు సత్యనారాయణ, చిత్ర దర్శకుడు శ్రీపురం కిరణ్‌, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌, మాటల రచయిత విస్సు, సహ నిర్మాత ముత్యాల రమేష్‌, సంగీత దర్శకుడు చిన్నా, సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.గోపాలరెడ్డి, బి.ఎ.రాజు, సురేష్‌ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘జీనియస్‌’ చిత్రంలోని పాటలకు, ‘రామ్‌లీల’ చిత్రంలోని పాటలకు సందీప్‌ డాన్స్‌ ట్రూప్‌ చేసిన నృత్యాలు అందర్నీ అలరించాయి.   ఈ సందర్భగా..

డా॥ పరుచూరి గోపాలకృష్ణ: నాకు తెలిసి జీనియస్‌ చాలా మంచి సినిమా. దానికి ఓవర్‌ బడ్జెట్‌ అయి వుండకపోతే అది సూపర్‌హిట్‌ సినిమా. కలెక్షన్స్‌ బాగానే వచ్చినప్పటికీ ఓవర్‌ బడ్జెట్‌ వల్ల దానికి సరిపోయింది కానీ లాభాలు రాలేదు. కానీ, ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తీశారు. అదే కరెక్ట్‌ కూడా. ఎన్టీఆర్‌గారు చేసిన నాదేశం చిత్రాన్ని 21 రోజుల్లో కంప్లీట్‌ చేశారు. అది 100 రోజులు ఆడిరది. ఈ సినిమాని 38 రోజుల్లో తీశారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అయి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతుందని నా నమ్మకం. హవీష్‌ జీనియస్‌లో చాలా గొప్పగా చేశాడు. అతనిది అద్భుతమైన వాయిస్‌. ఇలాంటి లవ్‌ సబ్జెక్ట్‌కి, అతనికి వున్న వాయిస్‌కి సరిపోదు. ఏదైనా రెవల్యూషనరీ మూవీ అయితే అతను చెప్పే డైలాగ్స్‌కి, అతని వాయిస్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. భవిష్యత్తులో అలాంటి సినిమా చేసే ఆలోచన వుంటే మా సహకారం తప్పకుండా వుంటుంది.

హవీష్‌: జీనియస్‌ తర్వాత ఈ బేనర్‌లో చేస్తున్న మరో మంచి సినిమా ఇది. శ్రీపురం కిరణ్‌గారు చాలా ఎక్స్‌లెంట్‌గా తీశారు. దాసరి కిరణ్‌కుమార్‌గారు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా రిచ్‌గా నిర్మించారు. చిన్నాగారి  మ్యూజిక్‌ ఎక్స్‌లెంట్‌గా వుంది. అన్ని పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. అన్నింటికంటే ముఖ్యంగా గోపాలరెడ్డిగారి ఫోటోగ్రఫీ అద్భుతమని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్‌ ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకు వుంది.

నందిత: చిన్నాగారి మ్యూజిక్‌ వండర్‌ఫుల్‌ అని చెప్పాలి. పాటలన్నీ చాలా  పెద్ద సక్సెస్‌ అయ్యాయి. సినిమా కూడా అంతకంటే పెద్ద సక్సెస్‌ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి యూనిట్‌లోని అందరూ ఎంతో కోఆపరేట్‌ చేశారు. నాకు ఇది మరో పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను.

మదాలసశర్మ: ఈ సినిమా చెయ్యడం ఎంతో సంతోషాన్ని కలిగించిందో మాటల్లో చెప్పలేను. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు. హీరో హవీష్‌ పెర్‌ఫార్మెన్స్‌ సూపర్బ్‌. తప్పకుండా ఈ సినిమా సూపర్‌ సక్సెస్‌ అవుతుంది. 

శ్రీపురం కిరణ్‌: ఆడియో సక్సెస్‌ అవడమే ఈ చిత్రానికి సంబంధించి సగం విజయం. ఇంత మంచి పాటలు ఇచ్చిన చిన్నాగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కథను తెరకెక్కించడంలో నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌గారు అందించిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. హీరో హవీష్‌గారు నాకు ఎంతో కోఆపరేట్‌ చేశారు. తన క్యారెక్టర్‌ను చాలా అద్భుతంగా పోషించారు. అలాగే హీరోయిన్‌ నందిత ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. నేను ఏదైతే అనుకున్నానో దాన్ని స్క్రీన్‌ మీద చూపించారు. అన్నింటి కంటే ముఖ్యంగా గోపాలరెడ్డిగారి ఫోటోగ్రఫీ సినిమాకి హైలైట్‌ అవుతుంది. ప్రతి సన్నివేశాన్ని చాలా అందంగా చూపించారు. సినిమా బాగా రావడంలో ఆయన కాంట్రిబ్యూషన్‌ ఎక్కువ అని చెప్పాలి. ఇలా అందరి కోఆపరేషన్‌తో ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఫిబ్రవరి 27న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఆదరించి మాకు ఘనవిజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను.

దాసరి కిరణ్‌కుమార్‌: ఈరోజు ఈ ఫంక్షన్‌లో హీరో చిన్నాగారు. ఆయన అద్భుతమైన మ్యూజిక్‌ ఇవ్వడం వల్ల, ఆడియో చాలా పెద్ద సక్సెస్‌ అవ్వడం వల్ల ఈ ఆడియో సక్సెస్‌మీట్‌ని చేసుకోగలుగుతున్నాం. ఆడియోలాగే ఈ సినిమా కూడా డెఫినెట్‌గా పెద్ద హిట్‌ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. జీనియస్‌కి 50 రోజుల ఫంక్షన్‌ చేశాం. అలాగే ఈ చిత్రం 50 రోజుల ఫంక్షన్‌ని కూడా చేస్తాం. ఈ సినిమా మీద నాకు అంత నమ్మకం వుంది. ఈ సందర్భంగా ఈచిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

చిన్నా: ఆడియోను సక్సెస్‌ను సక్సెస్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. నాకు సహకరించిన ఎంటైర్‌ టీమ్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆడియోలాగే సినిమా కూడా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను.

ఎస్‌.గోపాలరెడ్డి: రామ్‌లీల టీమ్‌ నా ఫ్యామిలీ లాంటిది. చిన్నాగారు వండర్‌ఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. అందుకే పాటలు ఇంత పెద్ద విజయాన్ని సాధించాయి. సినిమా కూడా అంతకంటే పెద్ద సక్సెస్‌ అవ్వాలని, ఈ చిత్రానికి పనిచేసిన అందరికీ మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను.

ముత్యాల రమేష్‌: చిన్నాగారు ఈ చిత్రానికి చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. పాటలన్నీ చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ ఆడియో సక్సెస్‌మీట్‌ జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. ఫిబ్రవరి 27న విడుదలవుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకులు ఘనవిజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను. 

విస్సు: మా సినిమాలోని పాటల్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కథకు మంచి మాటలు అందించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా కృతజ్ఞతలు. పాటలు మాత్రమే కాదు రీరికార్డింగ్‌ కూడా అద్భుతంగా చేశారు చిన్నాగారు. పాటల్లాగే సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను. 

కోనేరు సత్యనారాయణ: ఈ సినిమా బాగా రావడానికి యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ అహర్నిశలు పనిచేశారు. చిన్నాగారు అందించిన సంగీతం చాలా పెద్ద హిట్‌ అయి సినిమా మీద మాకు వున్న నమ్మకాన్ని మరింత పెంచింది. ఇంత మంచి సినిమా చేసిన కిరణ్‌కుమార్‌గారిని అభినందిస్తున్నాను. ఫిబ్రవరి 27న విడుదలవుతున్న ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను. 

హవీష్‌, అభిజీత్‌, నందిత, అక్ష, మదాలస శర్మ, ఆలీ, సప్తగిరి, భానుచందర్‌, నాగినీడు, కృష్ణుడు, శివన్నారాయణ, అనితాచౌదరి, వైవా హర్ష, జయవాణి, గుండు సుదర్శన్‌, ఇంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిన్నా, మాటలు: విస్సు, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, కెమెరా: ఎస్‌.గోపాలరెడ్డి, సహనిర్మాత: ముత్యాల రమేష్‌, నిర్మాత: దాసరి కిరణ్‌కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీపురం కిరణ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ