నిఖిల్, త్రిదా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘సూర్య వర్సెస్ సూర్య’. ఈ చిత్రానికి సంబంధించిన గుమ్మడికాయ ఫంక్షన్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో నిఖిల్, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, నిర్మాత మల్కాపురం శివకుమార్, మాటల రచయిత చందు మొండేటి, నటులు సత్య, వైవా హర్ష, నైజాం డిస్ట్రిబ్యూటర్ వాసు తదితరులు పాల్గొన్నారు.
నిఖిల్: ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి 5న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. టాప్ 5లో ఈ పాటలు వున్నాయి. కార్తీక్ చాలా అద్భుతమైన సినిమా తీశాడు. ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన రెండు టీజర్స్‌కి ఎక్స్‌లెంట్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ టైమ్ ఒక లవ్‌స్టోరీ చేశాను. చాలా క్యూట్‌గా వుండే లవ్‌స్టోరీ ఇది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. స్వామిరారా చిత్రం హోలీ రోజు రిలీజ్ అయింది, కార్తికేయ దీపావళికి రిలీజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా హోలీకి రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకి సంబంధించి నాకు అదో సెంటిమెంట్ అయింది.
కార్తీక్ ఘట్టమనేని: సూర్యుడికి, ఈ సినిమాలో హీరో సూర్యకి వున్న కాన్‌ఫ్లిక్ట్‌తో ఈ సినిమా చెయ్యడం జరిగింది. ఒక డిఫరెంట్ జోనర్‌లో చేసిన ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది.
వాసు: గతంలో రిలీజ్ అయిన నిఖిల్‌గారి సినిమా కార్తికేయ నైజాంలో 75 థియేటర్స్‌లో రిలీజ్ చేశాం. ఇప్పుడు సూర్య వర్సెస్ సూర్య చిత్రాన్ని 125 థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.
చందు మొండేటి: ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడే ఒక మంచి సినిమా అన్న టాక్ వచ్చింది. ఇలాంటి పాజిటివ్ వైబ్స్ వున్న ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం వుంది. నిఖిల్‌కి కార్తికేయలాగే సూర్య వర్సెస్ సూర్య కూడా సూపర్‌హిట్ సినిమా అవుతుంది.
మల్కాపురం శివకుమార్: ఒక సినిమాకి సంబంధించి కొబ్బరికాయ కొట్టినపుడు ఎంత సంతోషంగా వుంటామో గుమ్మడికాయ కొట్టినపుడు కూడా అదే సంతోషంతో వుంటే ఆ సినిమాకి చాలా మంచి జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ అదే సంతోషంతో వున్నారు. అందరూ హానెస్ట్‌గా ఇది తమ సినిమా అన్నట్టుగా కష్టపడి పనిచేశారు. డైరెక్టర్ కార్తీక్ షూటింగ్‌కి ముందు ఏదైతే చెప్పాడో దానికంటే 100 రెట్లు బాగా సినిమా తీశాడు. నా బ్రదర్‌లాంటి నిఖిల్ ఈ సినిమాకి నేను లేని టైమ్‌లో తనే ప్రొడ్యూసర్‌గా అన్నీ చూసుకున్నాడు. చందుగారి కోఆపరేషన్ ఈ సినిమాకి ఎంతో వుంది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సత్య మహావీర్ ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. సినిమా కూడా అంతకంటే పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. మార్చి 5న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ టైమ్ ఓవర్సీస్‌లో 200 స్క్రీన్స్‌లో ప్రదర్శించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 400కి పైగా థియేటర్స్‌లో, వరల్డ్‌వైడ్‌గా 700 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం.
నిఖిల్, త్రిదా, తనికెళ్ళ భరణి, మధుబాల, రావు రమేష్, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్, రాజా రవీందర్, ప్రవీణ్, సత్య, మస్త్ అలీ, అల్లరి సుభాషిణి, వైవా హర్ష, జెన్నీ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సత్య మహావీర్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, మాటలు: చందు మొండేటి, ఎడిటింగ్: గౌతమ్ నెరుసు, ఆర్ట్: టి.ఎన్.ప్రసాద్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, కృష్ణచిన్ని, డాన్స్: విజయ్, ఫైట్స్: వెంకట్, సపోర్టివ్ స్క్రీన్‌ప్లే: శశిధర్‌రెడ్డి, కోడైరెక్టర్: శరణ్ కొప్పిశెట్టి, ప్రొడక్షన్ కంట్రోలర్: టి.గంగాధర్‌రెడ్డి, నిర్మాత: మల్కాపురం శివకుమార్, రచన, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని.