Advertisementt

స్పైయిన్ లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల చిత్రం

Thu 26th Feb 2015 01:32 AM
allu arjun,trivikram,samantha,nitya menon,adha sharma,devisri prasad,s.radhakrishna  స్పైయిన్ లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల చిత్రం
స్పైయిన్ లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల చిత్రం
Advertisement
Ads by CJ
స్టైలిష్ స్టార్, అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ప్ర‌స్తుతం స్పైయిన్ లో పాట‌ల చిత్రీక‌ణ జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తో ఒక్క పాట షూటింగ్ మిన‌హ షూటింగ్ మెత్తం పూర్త‌వుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం,రావ్ రమేష్ నటిస్తున్నారు. అని కార్యక్రమాలు పూర్తి చేసి స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత ఎస్.రాధాకృష్ణ తెలియజేశారు.
ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా రూపొందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. తివిక్ర‌మ్ అత్తారింటికి దారేది చిత్రం త‌రువాత అల్లు అర్జున్ రేసుగుర్రం చిత్రం త‌రువాత చేస్తున్నందున‌ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నాం. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అందాల భామలు సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్ర‌స్తుతం స్పైయిన్ లో పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తో ఒక్క పాట షూటింగ్ మిన‌హ షూటింగ్ మెత్తం పూర్త‌వుతుంది.  మరి కొద్దిరోజుల్లో ఆడియో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. అని కార్యక్రమాలు పూర్తి చేసి స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాము.. అని అన్నారు. 
నటీనటులు
అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు
సాంకేతిక వర్గం
ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్  - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్ 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ