Advertisementt

'నమో గంగా' చిత్రం టీజర్ లాంచ్..!

Fri 27th Feb 2015 01:12 AM
namo ganga movie,teaser launch,sreenivas,ganeshananda swamy,venkatesh  'నమో గంగా' చిత్రం టీజర్ లాంచ్..!
'నమో గంగా' చిత్రం టీజర్ లాంచ్..!
Advertisement
Ads by CJ

దేవాలయం షార్ట్ ఫిలింతో 5 ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్న ప్రతిభావంతుడు 'ధీ' శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ సాయి ప్రొడక్షన్ సంస్థ 'నమో గంగ' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం టీజర్ లాంచ్ గురువారం హైదరాబాద్ లో జరిగింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అతిధిగా వచ్చిన దర్శకుడు భారవి మాట్లాడుతూ ''శ్రీనివాస్ చేసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చూసాను. చాలా బాగా తీసాడు. ఆయన దర్శకత్వం వహించిన 'నమో గంగా' సినిమా భారతదేశం మొత్తం గర్వించే కథగా మిగులుతుంది" అని అన్నారు.

ప్రొడ్యూసర్ వెంకటేష్ అరషన మాట్లాడుతూ "గంగానది గొప్పదనాన్ని ఈ తరానికి తెలియజేస్తూ, గంగాజలంలో ఉండే బయోకెమికల్ ప్రాపర్టీస్ ను సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తూ ఉత్కంట భరితంగా సాగే సోషియో ఫాంటసి చిత్రంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిపారు. గతంలో తమ సంస్థ 'సంపంగి' లాంటి మ్యూజికల్ ఎంటర్ టైనర్ నిర్మించామని ఈ సినిమాని దేశానికి ఉపయోగపడే చక్కని సందేశంతో పూర్తి స్థాయి వాణిజ్య విలువులతో తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నామని'' చెప్పారు.

దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ "జూలై లేదా ఆగస్ట్ నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా చూసి స్పందించని భారతీయుడు ఉండడు. ఈ కథను నమ్మి సహకరించిన నిర్మాతకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

శ్రీ గణేషానంద స్వామీజీ మాట్లాడుతూ "ఈ సినిమాతో శ్రీనివాస్ కు మంచి పేరు రావాలి. మా గంగ చాలా పవిత్రమైనది, మోక్షదాయిని. సినిమా పెద్ద సక్సెస్ అయ్యి టీమ్ అందరికి మంచి పేరు రావాలని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.

ఈ చిత్రంలో నటీనటులు : రాజ్ నరేంద్ర, సంజయ్, ధారణ శ్రీనివాస్, శ్రావని

సాంకేతిక వర్గం : సంగీతం: రామ్ సుధన్వి, కెమెరా: ప్రవీణ్ రెడ్డి రాపాలో, సమర్పణ: ఇందిరా దేవి గూడ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ