'మనం', 'గోపాల గోపాల' చిత్రాల విజయాలతో సక్సెస్ బాట పట్టింది ఢిల్లీ సుందరి శ్రీయ. ఈ సినిమాల్లో తన పంథాకు భిన్నంగా అభినయ ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల్ని శ్రీయ అలరించింది. ఈ చిత్రాలు చక్కటి విజయాలను అందుకోవడంతో ఆ తరహా పాత్రలమీదనే దృష్టిపెట్టిన ఆమె బాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్టులో స్థానం సంపాదించుకుంది. మలయాళ, తెలుగు భాషల్లో ఘన విజయాన్ని సాధించన 'దృశ్యం' హిందీ రీమేక్‌లో శ్రీయ నటించనుంది. ఈ సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా అభినయం ఉన్న పాత్రలో నటించే అవకాశం రావడంతో వెంటనే ఓకే చెప్పేసిందట శ్రీయ. ఇక హిందీలో 'దృశ్యం' సినిమాకు నిషికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తుండగా అజయ్‌దేవగణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇక టబు మరో కీలకపాత్రలో నటించనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది.