రీమేక్ చిత్రాలకు చక్కటి ప్రేక్షకాధరణ లభిస్తుండటంతో అగ్రతారలు సైతం వాటిపై దృష్టి సారిస్తున్నారు. ఓ భాషలో విజయం సాధించిన సినిమా మరో భాషలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో రిస్క్ తక్కువని తారలు రీమేక్ చిత్రాలకు ఓటు వేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం కన్నడంలో ఘన విజయం సాధించిన 'మైత్రి' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి హీరో నాగార్జున సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. మోహన్‌లాల్, పునీత్‌కుమార్ నటించిన ఈ చిత్రం కన్నడంలో ఘన విజయం సాధించింది. ఇటీవలే ఈ సినిమాను చూసిన నాగార్జున కథాంశంలోని కొత్తదనం నచ్చడంతో వెంటనే రీమేక్‌కు ఓకే చెప్పేశారని సమాచారం. ప్రస్తుతం నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా'తోపాటు తమిళ్ హీరో కార్తీతో కలిసి ఓ మల్లీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు.