నాని, మాళవిక నాయర్ జంటగా స్వప్న సినిమా పతాకంపై నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రియాంక దత్ నిర్మిస్తున్న చిత్రం 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఈ చిత్రం ఉగాది రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో స్వప్న మాట్లాడుతూ "ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాని భారతదేశంలో మునుపెవ్వరూ చిత్రీకరించని ఎత్తయిన హిమాలయాల్లో చిత్రీకరించాం. ఈ సినిమా పాటలు, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఎంత పీక్స్ కి వెళ్లి చిత్రీకరించడం జరిగిందో ఆడియో కూడా అంత పీక్స్ కి వెళ్లి ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా వరల్డ్ వైడ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ "నా మొదటి సినిమా ఇది. మా చిత్రబృందం అంత ఫ్యామిలీలా కలిసి ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ప్రస్తుతం వస్తున్న సినిమాలకి లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. మా సినిమా పది సంవత్సరాల తరువాత చూసిన కొత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో తీయడం జరిగింది" అని అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ "ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండి ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగాయి. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఉగాది రోజున విడుదలయ్యే మా చిత్రం ఉగాది పచ్చడిలానే అన్ని ఎలిమెంట్స్ కలిపి ఉంటుంది" అని అన్నారు.
విజయ్ మాట్లాడుతూ "ఈ సినిమాలో రిషి అనే క్యారెక్టర్ లో నటించాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ కి నా థాంక్స్. నాని లానే మంచి సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం : రదన్, సినిమాటోగ్రఫీ: రాకేశ్, నవీన్ ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు.