ప్రిన్స్, జ్యోతి సేథీ, సంపూర్నేష్ బాబు, రావు రమేష్ ముఖ్య తారాగణంగా వస్తున్న కొత్త చిత్రం వేర్ ఈజ్ విద్యా బాలన్ టీజర్ ఆదివారం రోజున (మార్చి ఒకటో తారీఖు) విడుదల చేస్తున్నట్టు దర్శకుడు శ్రీనివాస్ మీడియా వారికి తెలిపారు. శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఆద్యంతం వినోదభరితంగా, ఉత్కంట రేపే సస్పెన్స్ మిళితంగా రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని చెప్పారు దర్శకుడు.
శ్రీనివాస్ ఇంతకు మునుపు కథ (జెనిలియా హీరోయిన్), ఒక్కడినే (నారా రోహిత్, నిత్య మీనన్) చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం డీటీఎస్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం యొక్క పాటలు ఈ నెల మొదటి వారంలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు: ప్రిన్స్, జ్యోతి సేథీ, సంపూర్నేష్ బాబు, రావు రమేష్, జయప్రకాశ్ రెడ్డి, ఆశిష్ విద్యార్థి, సప్తగిరి, తాగుబోతు రమేష్, మధు నందన్, రవి ప్రకాష్, రవి వర్మ, జబర్దస్త్ సుడిగాలి సుదీర్, అప్పారావు, శ్రీను, అదుర్స్ రఘు, ప్రభాస్ శ్రీను, మాస్టర్ నిఖిల్, మాధవి లత, జెన్నిఫర్ (ఐటెం సాంగ్)
కెమెరా: చిట్టి బాబు (భీమిలి కబడ్డీ జట్టు, ప్రతినిధి ఫేం)
ఎడిటింగ్: మధు (రన్ రాజా రన్ ఫేం)
సంగీతం: కామ్రాన్
మాటలు: సాయి, వెంకీ డీ పాటి
సమర్పణ: కృష్ణ బద్రి, శ్రీధర్ రెడ్డి
సహ నిర్మాత: హేమ వెంకట్
ఎగ్జిక్యుటివ్ నిర్మాతలు: అక్కినేని శ్రీనివాస రావు, బాలాజీ శ్రీను
బ్యానర్: శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్
నిర్మాతలు: వేణు గోపాల్ రెడ్డి, లక్ష్మి నరసింహ రెడ్డి, ఆలూరి చిరంజీవి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్