Advertisementt

షూటింగ్‌లో గాయపడ్డ హీరో..!!

Sun 01st Mar 2015 04:13 AM
ranveer singh,bajirao masthani,accident,sanjayleela bansali  షూటింగ్‌లో గాయపడ్డ హీరో..!!
షూటింగ్‌లో గాయపడ్డ హీరో..!!
Advertisement
Ads by CJ

ప్రముఖ హిందీ యువ నటుడు రణవీర్‌సింగ్‌ బాజీరావు మస్తాని షూటింగ్‌లో గాయపడ్డాడు. సంజయ్‌లీలా బన్సాలీ రూపొందిస్తున్న ఈ చారిత్రాత్మక కథా చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం జైపూర్‌లో కొనసాగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఫైట్‌ను చిత్రీకరిస్తుండగా గుర్రంపైనుంచి రణవీర్‌ కిందపడిపోయి గాయాలపాలయ్యారు. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు రణవీర్‌కు ఎముకలు విరగడంలాంటి గాయాలు కాలేదు. అయితే గతంలో కూడా రణవీర్‌ పలు చిత్రాల షూటింగ్‌ సందర్భంగా గాయాలపాలయ్యారు. 'లూటేరా' సినిమా చిత్రీకరణ సమయంలో రణవీర్‌కు వీపుపై తీవ్ర గాయమైంది. అలాగే 'గుండే'  షూటింగ్‌ సమయంలోనూ రణవీర్‌ గాయపడ్డాడు. అయితే తన గాయాలను రణవీర్‌ చాలా తేలికగా తీసుకుంటున్నట్లు కనబడుతోంది. ఈ విషయమై మీడియా ప్రశ్నిస్తే.. పెద్ద పెద్ద సినిమాల్లో ఇలాంటి చిన్నచిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి.. లైట్‌ తీసుకోవాలంటూ వ్యాఖ్యానించాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ