హవీష్ హీరోగా కోనేరు సత్యనారాయణ సమర్పణలో, లంకాల బుచ్చిరెడ్డి రామదూత క్రియేషన్స్ పతాకంపై శ్రీపురం కిరణ్ ను దర్శకుడిగా దాసరి కిరణ్ కుమార్ తెరకెక్కించిన సినిమా 'రామ్ లీల'. ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ "200కు పైగా థియేటర్లలో విడుదలయ్యి హౌస్ ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా నడుస్తుంది. నా ప్రయత్నాన్ని ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. హవిష్ ఏ క్యారెక్టర్ ఇచ్చిన చేయగలడు అని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. అభిజిత్ ప్రీ క్లైమాక్స్ లో చాలా బాగా నటించాడు. హీరోయిన్ నందిత ఈ సినిమాలో తన నటనతో సౌందర్యను గుర్తుచేసింది. ఈ సినిమా కోసం నాకు సహకరించిన కోనేరు సత్యనారాయణ గారికి, లంకాల బుచ్చిరెడ్డి గారికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.
డైరెక్టర్ గోపాల్ మాట్లాడుతూ " ఈ సినిమా హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ నా అభినందనలు. హవీష్ 'నువ్విలా' సినిమాతో సక్సెస్ హీరో అయ్యాడు, 'జీనియస్' మూవీతో మాస్ హీరో అనిపించుకున్నాడు, ఈ సినిమాలో అన్ని షేడ్స్ చూపించాడు. హేవీష్ కు ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
డైరెక్టర్ శ్రీపురం కిరణ్ మాట్లాడుతూ "నా మొదటి సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ కోనేరు సత్యనారాయణ గారు ఓ తండ్రిలాగా న వెన్నంటే ఉంటూ నాకు సపోర్ట్ చేసారు" అని అన్నారు.
నైజాం డిస్ట్రిబ్యూటర్ వాసు మాట్లాడుతూ "సమర్ధవంతమైన నటీనటులతో, మంచి టెక్నీషియన్స్ తో చేసిన చిన్న ప్రయత్నం ఈ సినిమా. దాసరి కిరణ్ పబ్లిసిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైస్ అవలేదు. విజువల్ గా గోపాల్ రెడ్డి గారు చాలా అధ్బుతంగా సినిమాను చూపించారు" అని అన్నారు.
మాటల రచయిత విస్సు మాట్లాడుతూ "ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు చేసారు" అని అన్నారు.
హీరోయిన్ నందిత మాట్లాడుతూ "ఇంత పెద్ద సక్సెస్ అయిన సినిమాలో ఒక భాగం అవడం చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.
లంకాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ "ఒక అద్దంలా ఈ సినిమాను తీర్చి దిద్దిన గోపాల్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. హవీష్ ఈ సినిమాలో అధ్బుతంగా నటించాడు" అని అన్నారు.
కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ "ఇంత మంచి కథను ఇచ్చిన డైరెక్టర్ కి నా ధన్యావాదాలు. ఈ సినిమా చూసిన వారందరూ బాలీవుడ్ స్టైల్ లో ఉందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి టెక్నీషియన్ కు నా అభినందనలు" అని అన్నారు.
హవీష్ మాట్లాడుతూ "డైరెక్టర్ స్టొరీ చెప్పినపుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నేను చేసిన అన్ని పాత్రలలో నేను చాలా నచ్చి చేసిన పాత్ర ఇది" అని అన్నారు.