Advertisementt

‘భమ్‌ బోలేనాథ్‌’ సక్సెస్‌మీట్‌

Tue 03rd Mar 2015 05:43 AM
bham bolenath movie,bham bolenath review,bham bolenath success meet,navadeep,naveen chandra,pooja  ‘భమ్‌ బోలేనాథ్‌’  సక్సెస్‌మీట్‌
‘భమ్‌ బోలేనాథ్‌’ సక్సెస్‌మీట్‌
Advertisement
Ads by CJ

నవదీప్‌, నవీన్‌చంద్ర హీరోలుగా, పూజ హీరోయిన్‌గా ఆర్‌.సి.సి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కార్తీక్‌వర్మ దండు దర్శకత్వంలో శిరువూరి రాజేష్‌వర్మ నిర్మించిన ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ‘భమ్‌ బోలేనాథ్‌’. ఈ చిత్రం ఫిబ్రవరి 27న విడుదలైంది. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సక్సెస్‌మీట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్‌మీట్‌లో హీరోలు నవదీప్‌, నవీన్‌చంద్ర, హీరోయిన్‌ పూజ, దర్శకుడు కార్తీక్‌వర్మ దండు పాల్గొన్నారు. 

నవదీప్‌: ఇటీవల విడుదలైన మా చిత్రానికి చాలా డీసెంట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. కొత్త కాన్సెప్ట్‌తో, డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో కార్తీక్‌ చేసిన ఈ సినిమాకి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అందరికీ ఈ సినిమా రీచ్‌ అయింది. మాకు సంతోషం కలిగించే మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం కన్నడ రీమేక్‌ రైట్స్‌ తీసుకోవడం జరిగింది. ఇంత మంచి చిత్రంలో మేము కూడా పార్ట్‌ అయినందుకు ఆనందంగా వుంది. ఈ చిత్రాన్ని పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు.

నవీన్‌చంద్ర: ‘భమ్‌ బోలేనాథ్‌’ హిలేరియస్‌ సక్సెస్‌ అయింది. థియేటర్‌లో ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. మెయిన్‌గా ఈ సినిమాలో కామెడీ బాగా హైలైట్‌ అయింది. స్టైలిష్‌గా వుంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నందుకు హ్యాపీగా వుంది. ఆడియన్సే కాకుండా ఇండస్ట్రీలో కూడా సినిమా చాలా బాగుందని అప్రిషియేట్‌ చేస్తున్నారు. మా సినిమా సాధించిన విజయానికి యూనిట్‌లోని అందరం చాలా హ్యాపీగా వున్నాం. 

పూజ: మా సినిమాకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. థియేటర్‌లో కామెడీ సీన్స్‌కి ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్‌.

కార్తీక్‌వర్మ దండు: స్క్రీన్‌ప్లే బాగుందని చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు ఫోన్లు చేసి చెప్తున్నారు. యూత్‌, ఫ్యామిలీ, క్లాస్‌ ఇలా అందర్నీ ఈ సినిమా అలరిస్తోంది. ఈ సినిమా సాధించిన విజయంతో నాకు చాలా ఆఫర్స్‌ వస్తున్నాయి. నేను నెక్స్‌ట్‌ చేయబోయే సినిమా ఏమిటో ఒక నెలలో ఎనౌన్స్‌ చేస్తాను. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ