ప్రిన్స్, జ్యోతి సేథీ, సంపూర్ణేష్‌బాబు ప్రధాన పాత్రల్లో కృష్ణబద్రి, శ్రీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ దర్శకత్వంలో ఎల్.వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మీనరసింహారెడ్డి, ఎ.చిరంజీవి నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ 'Where is విద్యాబాలన్?’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మంగళవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హీరో శ్రీకాంత్ టీజర్‌ను లాంచ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో ప్రిన్స్, దర్శకుడు శ్రీనివాస్, నిర్మాతలు ఎల్.వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మీనరసింహారెడ్డి, ఎ.చిరంజీవి, సంగీత దర్శకుడు కామ్రాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
శ్రీకాంత్: చాలా మంచి టైటిల్ ఇది. ప్రిన్స్ నాకు తమ్ముడులాంటివాడు. మేం సిసిఎల్‌లో క్రికెట్ ఆడాం. ప్రిన్స్ ఓపెనింగ్ ఎంత బాగా చేస్తాడో ఈ సినిమా ఓపెనింగ్ అంతకంటే బాగుండాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ చేసిన ‘కథ’ సినిమా అంటే నాకు బాగా ఇష్టం. ఇప్పుడు క్రైమ్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ని కూడా మిక్స్ చేసిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌లో ఈ సినిమాని లాంచ్ చేయడం కరెక్ట్ డెసిషన్. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను.
ప్రిన్స్: ఈ సినిమాలో కామెడీ వుంది, రొమాన్స్ వుంది. ఇవన్నీ వుంటూనే ఆడియన్స్‌ని థ్రిల్ చేసే అంశాలు చాలా వున్నాయి. తప్పకుండా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.
శ్రీనివాస్: వచ్చే వారం మా చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ వుంటుంది. అలాగే ఈనెలలోనే సినిమాని కూడా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాలో ప్రిన్స్ చాలా అందంగా కనిపిస్తాడు. ఈ సినిమాలోని క్యారెక్టర్ కోసం బాగా వర్కవుట్ చేసి మంచి లుక్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం నాకు వుంది.
పి.లక్ష్మీనరసింహారెడ్డి: మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక మంచి సినిమా చెయ్యాలనుకున్నాం. దానికి మంచి టీమ్ కుదిరింది. శ్రీనివాస్‌గారు చాలా బాగా తీశారు. ఫస్ట్ కాపీ చూశాము. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ ఫంక్షన్‌కి వచ్చి మా సినిమా టీజర్‌ను లాంచ్ చేసిన శ్రీకాంత్‌గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
కామ్రాన్: మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇది నా ఫస్ట్ మూవీ. ఈ చిత్రంలోని పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. విజువల్‌గా కూడా మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి.
ప్రిన్స్, జ్యోతి సేథీ, జెన్నీఫర్, సంపూర్ణేష్‌బాబు, జయప్రకాష్‌రెడ్డి, రావు రమేష్, ఆశిష్ విద్యార్థి, సప్తగిరి, తాగుబోతు రమేష్, మధునందన్, ప్రభాస్ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చిట్టిబాబు, సంగీతం: కామ్రాన్, ఎడిటింగ్: మధు, పాటలు: కాసర్ల శ్యామ్, వరికుప్పల యాదగిరి, ఫైట్స్: నందు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అక్కినేని శ్రీనివాసరావు, బాలాజీ శ్రీను, కోప్రొడ్యూసర్: హేమ వెంకట్, నిర్మాతలు: ఎల్.వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మీనరసింహారెడ్డి, ఎ.చిరంజీవి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్.