Advertisementt

మార్చి నెలాఖరున ‘వారధి’

Thu 05th Mar 2015 04:14 AM
telugu movie varadhi,sridivya,satish karthikyeya,vivekananda varma  మార్చి నెలాఖరున ‘వారధి’
మార్చి నెలాఖరున ‘వారధి’
Advertisement
Ads by CJ

కాస్మిక్‌ ఇమాజినేషన్స్‌ బ్యానర్‌పై క్రాంతి, శ్రీదివ్య, హేమంత్‌ హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘వారధి’. వివేకానంద వర్మ నిర్మాత. సతీష్‌ కార్తికేయ దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఈ నెలాఖరున విడుదల చేయాలని చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా..

నిర్మాత వివేకానందవర్మ మాట్లాడుతూ ‘‘సినిమాలో ముఖ్యంగా మూడు క్యారెక్టర్స్‌ ఉంటాయి. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ. ఇందులో ఎవరి ప్రేమకు ఎవరు వారధిగా నిలిచారు, ఎవరి ప్రేమ గెలిచిందనేది కాన్సెప్ట్‌. హీరో క్రాంతి చాలా డిఫరెంట్‌గా సైకో క్యారెక్టర్‌ చేశాడు. నలుగురు బాధలో సంతోషాన్ని వెతుక్కునే హీరో, నలుగురు బాగుండాలనుకునే హీరోయిన్‌ మధ్య ఎలాంటి ప్రేమకథ నడిచింది అనేది ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. హేమంత్‌ చాలా మంచి పాత్ర చేశాడు. ఇందులో శ్రీదివ్య పెర్‌పార్మెన్స్‌ అదరగొట్టింది. తనకి చాలా మంచి పేరు వస్తుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ విజయ్‌గొర్తి అద్భుతమైన పాటలు ఇచ్చాడు. ఈ సినిమాలోని నాలుగు పాటలను నాలుగు టీవీ ఛానెల్స్‌లో ఇటీవల హీరో, హీరోయిన్లు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ విడుదల చేశారు. ఈ పాటలకు చాలా మంచి స్పందన వస్తుంది. అలాగే ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యమ్రాలు పూర్తి కావచ్చాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. 

>డైరెక్టర్‌ సతీష్‌ కార్తికేయ మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యమ్రాలు పూర్తి కానున్నాయి. అలాగే ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి, నాలుగు సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. నిర్మాత వివేకానంద వర్మగారి సహకారం మరువలేనిది. క్రాంతి, హేమంత్‌, శ్రీదివ్యలు చక్కగా నటించారు. సినిమాని ఈ నెలాఖరును విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.

క్రాంతి, శ్రీదివ్య, హేమంత్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, రంగనాథ్‌, సి.వి.యల్‌.సూర్య, బెంగళూర్‌ పద్మ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సాహిత్యం: చైతన్య వర్మ, ఎడిటర్‌: కార్తిక శ్రీనివాస్‌, సంగీతం: విజయ్‌ గొర్తి, కెమెరా: రాజేంద్రకేసాని, నిర్మాత: వివేకానంద వర్మ, రచన`దర్శకత్వం: సతీష్‌ కార్తికేయ

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ