Advertisementt

'టిప్పు' సినిమా టీజర్ లాంచ్..!

Thu 05th Mar 2015 05:51 AM
tippu cinemaa,teaser launch,c.kalyan,k.s.ramarao,sathya karthik  'టిప్పు' సినిమా టీజర్ లాంచ్..!
'టిప్పు' సినిమా టీజర్ లాంచ్..!
Advertisement
Ads by CJ

ఆదిత్య ఫిల్మ్స్ పతాకంపై డి.వి.సీతారామరాజు నిర్మిస్తున్న సినిమా టైటిల్ 'టిప్పు' ది వారియర్ ఆఫ్ లవ్ ఉపశీర్షిక. ఈ సినిమా టీజర్ లాంచ్ గురువారం(మార్చి5) హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అథిదిగా వచ్చిన కె.ఎస్.రామారావు మాట్లాడుతూ "వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ రాజు తనయుడైన సత్య కార్తిక్ హీరో ఈ సినిమాతో పరిచయం అవబోతున్నాడు. వైజాగ్ సత్యనాథ్ గారి దగ్గర నటనలో శిక్షణ పొందిన సత్య కార్తిక్ భవిష్యత్తులో మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ "టీజర్ చాలా బావుంది. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తున్నాడు హీరో సత్య కార్తిక్. డిస్ట్రిబ్యూటర్ రాజు గారు ఇండస్ట్రీలో ఉత్తముడు వారి తనయుడైన సత్యకార్తిక్ కి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి" అని అన్నారు.

సౌత్ ఇండియా ఫిలిం ఫెడెరేషన్ ప్రెసిడెంట్ సి.కళ్యాన్ మాట్లాడుతూ "చిన్నప్పటి నుండి కార్తిక్ కు మూవీస్ అంటే చాలా ప్యాషన్. టీజర్ లో చాలా అందంగా కనిపిస్తున్నాడు. సినిమా పెద్ద సక్సెస్ అయ్యి నిర్మాతలకు మంచి లాభాలు రావాలి" అని అన్నారు.

వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ "సత్యకార్తిక్ నాకు మంచి స్నేహితుడు. సినిమాలపై విపారీతమైన ప్యాషన్ ఉన్న యంగ్ హీరో. ఈ సినిమాతో తనకు మంచి పేరు రావాలి" అని అన్నారు.

డైరెక్టర్ జగదీష్ దానేటి మాట్లాడుతూ "దర్శకత్వ శాఖ నుండి మాటల రచయితగా మారడానికి డైరెక్టర్ పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్ ఎంతగానో ప్రోత్సహించారు. ఈ సినిమాలో కార్తిక్ అధ్బుతంగా నటించాడు. అనుకున్న బడ్జెట్ లో, అనుకున్న సమయంలో ఈ సినిమాను పూర్తి చేయగలిగాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు" అని అన్నారు.  

హీరో సత్య కార్తిక్ మాట్లాడుతూ "హీరోగా తెరపై కనిపించాలి అని అనుకునే నాకు ఈ సినిమా స్క్రిప్ట్ అయితే కరెక్ట్ అని అనిపించి ఈ సినిమాలో నటించాను. ఈ సినిమాకు మణిశర్మ గారు మంచి మ్యూజిక్ అందించారు" అని అన్నారు.

ప్రొడ్యూసర్ డి.వి.సీతారామరాజు మాట్లాడుతూ "ఈ నెలాఖరులో ఆడియో రిలీజ్ చేసి, ఏప్రిల్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.

ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్: రాజశేఖర్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఫైట్స్: వెంకట్, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివరామి రెడ్డి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ