మరో సినీ రైటర్ డైరెక్టర్‌గా మారబోతున్నాడు. కిక్, ఊసరవెల్లి, ఎవడు, రేసుగుర్రం, టెంపర్‌లాంటి విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ త్వరలోనే మెగా ఫోన్ పట్టనున్నాడు. టెంపర్ చిత్రం హిట్‌తో మంచి ఊపు మీదున్న జూనియర్ ఎన్టీఆర్ తదుపరి రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్‌లో నటించడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం సుకుమర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వక్కంతం వంశీ చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వక్కంతం వంశీ వెల్లడించారు. ఇటీవలే ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పానని, ఆయనకు బాగా నచ్చడంతో స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఇప్పుడు వంశీ బిజీగా ఉన్నాడు. గతంలో ఎన్నడూ చూపించని సరికొత్తకోణంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపించనున్నట్లు సమాచారం.