Advertisementt

ఈసారి వెంకటేష్‌, రవితేజల వంతు..!!

Fri 06th Mar 2015 05:30 AM
venkatesh,raviteja,jilla,remake  ఈసారి వెంకటేష్‌, రవితేజల వంతు..!!
ఈసారి వెంకటేష్‌, రవితేజల వంతు..!!
Advertisement
Ads by CJ

విజయ్‌, మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'జిల్లా'. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రవితేజ, వెంకటేష్‌ నటించనున్నారని సమచారం. గతంలో తెలుగులో ఈ మూవీని ఓ ప్రముఖ హీరో రీమేక్‌ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే కథ సంతృప్తి కరంగా లేదని ఆ హీరో ఈ మూవీ రీమేక్‌ ప్రాజెక్టునుంచి పక్కకు తప్పుకున్నారు. ఇక అదే సమయంలో ఈ సినిమా గురించి తెలుసుకున్న వెంకటేష్‌, రవితేజలు మాత్రం ఓకే చెప్పినట్లు తెలిసింది. ఏప్రిల్‌లో సెట్స్‌ మీదకు వచ్చే ఈ సినిమాకు వీరుపోట్ల దర్శకత్వం వహిస్తారని సమాచారం. 'గోపాల గోపాల' మల్టీస్టారర్‌ మూవీతో మంచి హిట్‌ను అందుకున్న వెంకటేష్‌ ఇక రవితేజతో కలిసి ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో వేచిచూడాల్సిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ