Advertisementt

ప్రాణాపాయం నుంచి బయటపడ్డ హీరోయిన్‌..!!

Fri 06th Mar 2015 05:31 AM
sonamkapoor,swineflu,discharge,hospital  ప్రాణాపాయం నుంచి బయటపడ్డ హీరోయిన్‌..!!
ప్రాణాపాయం నుంచి బయటపడ్డ హీరోయిన్‌..!!
Advertisement
Ads by CJ

స్వైన్‌ఫ్లూ బారినపడి ముంబాయ్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్‌ కథానాయిక సోనమ్‌కపూర్‌ గురువారం డిశ్చార్జి అయ్యారు. ఆమె వ్యాధినుంచి పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సోదరి రేఖ పుట్టిన రోజు వేడుక నాడే సోనమ్‌కపూర్‌ ఇంటికి చేరుకోవడంపై ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే రాజస్తాన్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన 'ప్రేమ్‌ రతన్‌ దన్‌ పాయో' చిత్రం షూటింగ్‌ సందర్భంలో సోనమ్‌కపూర్‌కు స్వైన్‌ప్లూ సోకిన విషయం తెలిసిందే. ఇంటిదగ్గర కొన్ని రోజులు రెస్ట్‌ తీసుకున్న అనంతరం సోనమ్‌కపూర్‌ షూటింగ్‌లకు హాజరవుతారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 'రాన్‌జనా' చిత్రం తర్వాత సోనమ్‌కపూర్‌ నటించిన ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటిస్తున్న 'ప్రేమ్‌ రతన్‌ దన్‌ పాయో'పైనే సోనమ్‌కపూర్‌ ఆశలు పెట్టుకుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ