Advertisementt

మార్చి 12న గోపిచంద్ 'జిల్' ఆడియో

Sat 07th Mar 2015 08:08 AM
hero gopichand,jil movie,jil audio on 12th march,  మార్చి 12న గోపిచంద్ 'జిల్' ఆడియో
మార్చి 12న గోపిచంద్ 'జిల్' ఆడియో
Advertisement
Ads by CJ

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిర్చి వంటి బ్లాక్ బస్టర్ తో తొలి ప్రయత్నమే సూపర్ సక్సెస్ అందుకున్న నిర్మాతలు వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ సంయుక్తంగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై, లౌక్యం చిత్రంతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నగోపిచంద్ హీరోగా నిర్మిస్తున్న జిల్ చిత్ర ఆడియోను ఈనెల 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో హైదరాబాద్ లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. రన్ రాజా రన్, ఉత్తమ విలన్ వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతమందించిన జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతమందించడం విశేషం. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గోపిచంద్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈనెలాఖరులోనే చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... గోపిచంద్ హీరోగా యూవి క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించి జిల్ అనుకున్న సమయానికి పూర్తి చేయగలిగాం. ఇటీవలే ఫారిన్ లో అందమైన లొకేషన్స్ లో పాటలు చిత్రీకరించాం. షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ టేకింగ్ కొత్తగా ఉంటుంది. గోపిచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకునే స్టామినా ఉన్న సినిమా ఇది. జిబ్రాన్ అందించిన పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. రీ రికార్డింగ్ కూడా చాలా బాగా వస్తోంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఈ చిత్ర ఆడియోను సినీ సెలెబ్రిటీలు, అభిమానుల సమక్షంలో మార్చి 12న హైదరాబాద్ లో విడుదల చేయనున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈనెలాఖరులోనే చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకు తీసుకొస్తాం. అని అన్నారు 

నటీనటులు - గోపిచంద్, చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబి అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు. 

సాంకేతిక వర్గం: కాస్ట్యూమ్ డిజైనర్ - తోట విజయ్ భాస్కర్, ఆర్ట్ డైరెక్టర్ - ఎ.ఎస్.ప్రకాష్, యాక్షన్ డైరెక్టర్ - అనిల్ అరసు, ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వర రావు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి - శక్తి శరవణన్, మ్యూజిక్ - జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - ఎన్.సందీప్, ప్రొడ్యూసర్స్ - వి.వంశీ, ప్రమోద్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - రాధా కృష్ణ కుమార్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ