గ్రీన్ సన్ ఇన్నోవేటివ్స్, జైహిత క్రియేషన్స్ సంయుక్తంగా...బస్టాప్, గ్రీన్ సిగ్నల్ ఫేం సాయి రవి, కన్నడ నటి దీప్తి హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ఇక సె...లవ్. డుంగ్రోత్ నాగరాజ్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 9న ఖమ్మం లోని లక్ష్మీనరసింహ స్వామి గుడిలో ప్రారంభమై.. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటివరకు 50 శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో షూటింగ్ పూర్తవుతుంది. ఏప్రిల్ నెలలో నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే నెలలో రిలీజ్ కానుందని నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ... వాల్మీకి తర్వాత రామాయణాన్ని ఎంతమంది రచించినా దేని ప్రత్యేకత దానికే ఉన్నట్టు.... సెల్యులాయిడ్ పై ఎన్ని ప్రేమకథలు వచ్చినా... ఈ చిత్రం మాత్రం ప్రత్యేక ప్రేమకథగా..నిలిచిపోతుంది. అని అన్నారు.
సీనియర్ కెమెరామెన్ వి.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని గన్నవరపు చంద్రశేఖర్, పీర్యానాయక్, రవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రచన, దర్శకత్వం - డుంగ్రోత్ నాగరాజ్