Advertisementt

‘పంచమి’ సక్సెస్‌మీట్‌

Sun 08th Mar 2015 12:43 PM
heroine archana,panchami movie,sujatha bouriya,  ‘పంచమి’ సక్సెస్‌మీట్‌
‘పంచమి’ సక్సెస్‌మీట్‌
Advertisement
Ads by CJ

హీరోయిన్‌ అర్చనతో ఒకే ఒక పాత్రతో ఐడియా మూవీ క్రియేషన్స్‌ పతాకంపై సుజాత బౌరియా దర్శకత్వంలో డి.శ్రీకాంత్‌ నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం ‘పంచమి’. ఈ చిత్రం ఇఈవల విడదలై అందరి ప్రశంసలు అందుకొని విజయవంతం ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో ఆదివారం ఉమెన్స్‌ డే సందర్భంగా ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్‌మీట్‌లో హీరోయిన్‌ అర్చన, దర్శకురాలు సుజాత బౌరియా, నిర్మాత డి.శ్రీకాంత్‌, సినిమాటోగ్రాఫర్‌ రఘు బళ్లారి, సంగీత దర్శకుడు శ్రీకోటి, గేయ రచయిత ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

అర్చన: ఇది నాకు చాలా ఇంపార్టెంట్‌ రోజు. అలాగే మార్చి 6కి కూడా నా జీవితంలో  చాలా ఇంపార్టెన్స్‌ వుంది. ఎందుకంటే మార్చి 6న ‘పంచమి’ సినిమా విడుదలైంది. అలాగే ఉమెన్స్‌ డే అయిన ఈరోజు ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ జరుపుకుంటున్నాం. ఒక ప్రయోగాత్మక చిత్రానికి హిట్‌, ఫ్లాప్‌, సక్సెస్‌ లాంటివి వుండవు. ఎందుకంటే మేం చేసిన ఎక్స్‌పెరిమెంట్‌కి ఎలాంటి అప్రిషియేషన్స్‌ వస్తున్నాయన్నదే ఇంపార్టెంట్‌. ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను ఎంత హానెస్ట్‌గా సినిమా గురించి చెప్పానో అంతే హానెస్ట్‌గా ఆడియన్స్‌ థియేటర్స్‌కి వెళ్ళి సినిమా చూస్తున్నారు. అంతకు మించిన సక్సెస్‌ మరొకటి లేదని నా అభిప్రాయం. రోజు రోజుకీ ఈ చిత్రానికి కలెక్షన్స్‌ పెరుగుతున్నాయి. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో నేను ఫిజికల్‌గా ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఇందులో డూప్‌ లేకుండా నేను చేసిన ఫైట్స్‌కి చాలా మంచి అప్రిషియేషన్‌ వస్తోంది. ఈ సినిమాని మా నిర్మాత శ్రీకాంత్‌గారు ఎంతో సిన్సియర్‌గా నిర్మించడమే కాకుండా, సిన్సియర్‌గా ప్రమోట్‌ చేస్తున్నారు. దానికి మీడియాతోపాటు అందరూ సహకరించడం వల్ల ఈ సక్సెస్‌ సాధ్యమైంది. 

డి.శ్రీకాంత్‌: మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా యూనిట్‌ మెంబర్స్‌, డిస్ట్రిబ్యూటర్లు చాలా హ్యాపీగా వున్నారు. ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రెండు సంవత్సరాల క్రితం స్టార్ట్‌ చేసిన ఈ సినిమా ఇప్పటికీ లైవ్‌ వుండడమే కాకుండా రిలీజ్‌ అయిన తర్వాత వస్తున్న అప్రిషియేషన్‌ చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది. ఇకపై కూడా మంచి సినిమాలు నిర్మించడానికి ప్రేక్షకులునాకు ఉత్సాహాన్నిచ్చారు. 

సుజాత బౌరియా: ఉమెన్స్‌ డే రోజున మా సినిమా సక్సెస్‌మీట్‌ని జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. ఇతర భాషల్లో ఎక్స్‌పెరిమెంట్‌ మూవీస్‌ని ఆదరిస్తారని, తెలుగులో ఇలాంటి చిత్రాలకు ఆదరణ తక్కువని చాలా మంది చెప్తుంటారు. అది నిజం కాదని ‘పంచమి’ ప్రూవ్‌ చేసింది. అన్నిచోట్ల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈరోజు నుంచి కొన్ని ఏరియాల్లో థియేటర్స్‌ కూడా పెంచుతున్నాం. ఈ చిత్రాన్ని ఇంకా పెద్ద సక్సెస్‌ చేసి ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.

శ్రీకోటి: సింగిల్‌ క్యారెక్టర్‌తో చేసిన ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్‌ వస్తుందోనని యూనిట్‌లోని అందరూ టెన్షన్‌ పడ్డారు. నాకు ఈ సినిమా రీరికార్డింగ్‌ చేసేటపుడే డెఫినెట్‌గా హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌ వచ్చింది. రిలీజ్‌ అయిన అన్ని సెంటర్స్‌లో కలెక్షన్స్‌ బాగున్నాయి. ఈ సక్సెస్‌ ఇలాగే కొనసాగి 50 రోజుల ఫంక్షన్‌ చేసుకోవాలని కోరుకుంటున్నాను. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ