ఎన్నో యాడ్స్ తో ప్రచార రంగంలో విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న డ్రీమ్ మర్చంట్స్ సంస్థ ఇప్పుడు సినిమా నిర్మాణంలోకి ప్రవేశించింది. డ్రీమ్ మర్చంట్స్ అధినేత మానిక్యవేల్ తన కుమారుడు పర్వీన్ రాజ్ ను హీరోగా పరిచయం చేస్తూ 'ప్లేయర్' పేరుతో ఓ విభిన్న చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. జ్ఞానసాగర్ దర్శకత్వంలో యమున కిషోర్, జగదీశ్ కుమార్ కల్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ బుధవారం హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధులుగా ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చోటా కె. నాయుడు, ఆర్.పి. పట్నాయక్ విచ్చేసారు.
ఈ సందర్భంగా చోటా కె నాయుడు మాట్లాడుతూ హైదరాబాద్ లో యాడ్స్ ఎందుకు చేయడం లేదు అనుకునే వాడిని. బాలు గారు, సీతారామ శాస్త్రి గారితో చేసిన ఒక యాడ్ చూసి నేను కూడా డ్రీమ్ మర్చంట్స్ మెంబెర్ అయిపోయాను. ఈ బ్యానర్ లో అందరూ కొత్త వారితో చేస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
రిచా పనయ్ మాట్లాడుతూ డ్రీమ్ మర్చంట్స్ వంటి మంచి సంస్థలో నటించడం చాలా హ్యాపీ గా వుంది అన్నారు.
పరుచూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఈ బ్యానర్ లో చేస్తున్న ఈ సినిమా మంచి ప్రయోగం అయి వుంటుంది. ఈ సినిమా లైన్ చెప్పారు. చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు సక్సెస్ చేస్తే ఇంకా మంచి సినిమాలు తీసే అవకాసం వుంటుంది అన్నారు.
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ పోస్టర్ లాంచ్ చాలా వెరైటీ గా చేసారు. సినిమా కూడా అలాగే తీసి వుంటే మైండ్ బ్లోయింగ్ గా వుంటుంది. యాడ్స్ చేసే ఈ సంస్థ తీసిన సినిమా ఎక్కడా లాగ్ లేకుండా ఉంటుందని అనుకుంటున్నాను అన్నారు.
హీరో పర్వీన్ రాజ్ మాట్లాడుతూ ఇది మా మొదటి ప్రయత్నం. చాలా కస్టపడి చేసాము. ఫలితాల కోసం పరీక్షలు రాసిన స్టూడెంట్స్ లా ఎదురు చూస్తున్నాం అన్నారు.
మానిక్యావేల్ మాట్లాడుతూ మా త్రిబుల్ ఎక్స్ సోప్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పేరు మా స్నేహితుడి గుర్తుగా పెట్టాను. మేమిద్దరం కలిసి త్రిబుల్ ఎక్స్ రమ్ తాగే వాళ్ళం. ఈయన ఇప్పుడు లేరు. అందుకే ఈ పేరు పెట్టాము అన్నారు.
ఎస్పీ బాలు మాట్లాడుతూ ఈ సినిమాకి సంబంధించిన వారంతా సింపుల్ గానే వుంటారు. కానీ సినిమా మాత్రం చాలా బాగా తీసి ఉంటారని అనుకుంటున్నాను అన్నారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి మాట్లాడుతూ డ్రీమ్ మర్చంట్స్ తో నాకు ఎంతో అనుబంధం వుంది. నాతో చేసిన సువర్ణ భూమి, సుభ గృహ యాడ్స్ చాలా బాగా వచ్చాయి. ఈ సంస్థ చేస్తున్న సినిమా కూడా పెద్ద హిట్ అయి అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అన్నారు.
పర్వీన్ రాజ్, షాహి, నాగినీడు, సీత, చాణక్య సాయి, తిరు, సుదర్శన్, తేజ, రానా, సిరింత్ర, ఈంగ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం రాజేష్ రఘునాథ్, సినిమాటోగ్రఫీ సురేష్, ఎడిటింగ్ సందీప్ రావి, నిర్మాతలు యమున కిషోర్, జగదీశ్ కుమార్ కల్లూరి, దర్సకత్వం జ్ఞాన సాగర్.