Advertisementt

ప్రభాస్‌ ఆవిష్కరించిన ‘జిల్‌’ ఆడియో

Fri 13th Mar 2015 02:14 PM
telugu movie jil,gopichand,prabhas,rashi khanna,uv creations,ghibran  ప్రభాస్‌ ఆవిష్కరించిన ‘జిల్‌’ ఆడియో
ప్రభాస్‌ ఆవిష్కరించిన ‘జిల్‌’ ఆడియో
Advertisement
Ads by CJ

ఎగ్రెసివ్‌ హీరో గోపిచంద్‌ కథానాయకుడుగా యు.వి.క్రియయేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రమోద్‌, వంశీ నిర్మిస్తున్న చిత్రం ‘జిల్‌’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో పలువురు సినీ ప్రముఖుల నడుమ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఆడియోను ఆవిష్కరించి హీరో గోపీచంద్‌కి తొలి  సి.డి.ని అందించారు. గిబ్రాన్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో జంగ్లీ మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఇంకా ఈ ఆడియో వేడుకలో సంగీత దర్శకుడు జిబ్రాన్‌, సినిమాటోగ్రాఫర్‌ శక్తి శరవణన్‌, రాశిఖన్నా, కబీర్‌, శ్రీవాస్‌, విజయ్‌కుమార్‌ కొండా, సుజీత్‌, శ్రీమణి, భవ్య ఆనంద్‌ప్రసాద్‌, రామజోగయ్య శాస్త్రి, లక్ష్మణ్‌, మారుతి, డైరెక్టర్‌ జి.అశోక్‌, కృష్ణకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

ప్రభాస్‌: నేను హీరో అవక ముందే గోపీకృష్ణా మూవీస్‌ ఆఫీస్‌లో మొదటిసారి కలిసాను. వర్షం చిత్రంతో మేం బాగా క్లోజ్‌ అయ్యాం. ఈ చిత్రంలో నాకు ‘స్వింగ్‌ స్వింగ్‌’ అనే పాట బాగా నచ్చింది. నేను, గోపీ టైమ్‌ దొరికినపుడు స్టోరీ డిస్కషన్స్‌ కూడా చేసుకుంటూ వుంటాం. ఈ చిత్రానికి రాధాకృష్ణ మంచి కథ, స్క్రీన్‌ప్లే అందించాడు. జిబ్రాన్‌ మ్యూజిక్‌ చాలా బాగుంది. ఆడియో తప్పకుండా మంచి హిట్‌ అవుతుంది. అలాగే సినిమా కూడా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను.

గోపీచంద్‌:  ఈ కథ ఏడాదిన్నర క్రితం రాధాకృష్ణ నాకు చెప్పాడు. పాయింట్‌ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా నాతో చెయ్యాలని చాలా కాలం వెయిట్‌ చేశాడు. ఈ మంచి కథకి మంచి నిర్మాతలు దొరికారు. ఈ ముగ్గురూ నన్ను కొత్తగా ప్రెజెంట్‌ చెయ్యాలని డిసైడ్‌ అయి ఈ సినిమా స్టార్ట్‌ చేశారు. ఈ సినిమాలో నా లుక్‌ చాలా కొత్తగా అనిపిస్తుంది. జిబ్రాన్‌ చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. పాటలకు తగినట్టు రాజసుందరంగారు మంచి డాన్స్‌ కంపోజ్‌ చేశారు. ఈ చిత్రంలో కొత్త విలన్‌ కబీర్‌ చాలా అద్భుతంగా చేశాడు. అతనికి విలన్‌గా చాలా మంచి భవిష్యత్తు వుంది. సినిమాటోగ్రాఫర్‌ శక్తి శరవణన్‌ నన్ను చాలా బాగా చూపించారు. డెఫినెట్‌గా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. 

రాధాకృష్ణకుమార్‌: ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా ధన్యవాదాలు. ఈ నిర్మాతలు వంశీ, ప్రమోద్‌ నా బ్రదర్స్‌లా నాకు ఎంతో సహకరించారు. అలాగే గోపీచంద్‌ కోఆపరేషన్‌ ఎప్పటికీ మర్చిపోలేను. 

వి.ఆనంద ప్రసాద్‌: ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్న ఈ దర్శకనిర్మాతలకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా యు.వి.క్రియేషన్స్‌ ఈ చిత్రంతో హ్యాట్రిక్‌ కొడుతుంది. 

విజయ్‌కుమార్‌ కొండా: ఈ సినిమా టైటిల్‌ చాలా కొత్తగా వుంది. అలాగే గోపీచంద్‌ లుక్‌లోగానీ, పాటల్లోగానీ చాలా కొత్తదనం కనిపిస్తోంది. ఈ ఆడియో, సినిమా పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 

శ్రీవాస్‌: గోపిచంద్‌ ‘లక్ష్యం’తో నన్ను డైరెక్టర్‌ని చేశారు. నా బ్రదర్‌లాంటి ఆయనకి ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి. రాధాకృష్ణకి తొలి సినిమాకే మంచి నిర్మాతలు దొరికారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. 

మారుతి: మంచి అభిరుచి వున్న నిర్మాతలు వంశీ, ప్రమోద్‌. వాళ్ళు చేసే సినిమాలన్నీ చాలా డిఫరెంట్‌గా వుంటున్నాయి. ఈ సినిమాతో గోపీచంద్‌గారికి మరో సూపర్‌హిట్‌ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రంలో విజువల్స్‌ అన్నీ చాలా బాగున్నాయి. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది.

జిబ్రాన్‌:  యు.వి.క్రియేషన్స్‌ బేనర్‌లో మరో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. ప్రమోద్‌, వంశీ, రాధాకృష్ణగారు నన్ను బాగా సపోర్ట్‌ చేశారు. సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం వుంది. పాటలు కూడా అందరికీ నచ్చుతాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ