రవివర్మ, కిషోర్, సంకీర్త్, వ్రితి ఖన్నా ప్రధాన పాత్రల్లో గోల్డెన్ టైమ్ పిక్చర్స్ పతాకంపై పన్నా రాయల్ దర్శకత్వలో అనూద్ నిర్మిస్తున్న హార్రర్ థ్రిల్లర్ ‘కాలింగ్‌బెల్’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ బిగ్ సిడిని, ప్రోమోను ఆవిష్కరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్ ఆడియోను ఆవిష్కరించి సి.కళ్యాణ్‌కు ఫస్ట్ సీడీని సి.కళ్యాణ్‌కు అందించారు. పి.సుకుమార్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో హేమాస్ మీడియా ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఇంకా ఈ ఆడియో ఫంక్షన్‌లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ కొడాలి వెంకటేశ్వరరావు, మాదాల రవి, ‘వీకెండ్ లవ్’ దర్శకుడు నాగు గవర, హీరో మనోజ్ నందం, హీరో రవివర్మ, సంకీర్త్, వ్రితి ఖన్నా, మమత రహుత్, సంగీత దర్శకుడు పి.సుకుమార్, నిర్మాత అనూద్, దర్శకుడు పన్నా రాయల్, హేమాస్ మీడియా అధినేత కె.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
సి.కళ్యాణ్: ఈమధ్యకాలంలో ఎన్నో సినిమా ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. కొన్ని సినిమాలకు సంబంధించిన టీజర్స్, ట్రైలర్స్ చూస్తుంటే చాలా బాధ కలిగింది. అవగాహన లేకుండా చాలా ఛీప్ క్వాలిటీతో సినిమాలు చేస్తున్నారు. ఆ టీజర్స్ చూసినపుడే సినిమా ఎలా తీసి వుంటారనేది అర్థమైపోతుంది. అన్ని సినిమాలను ఎంకరేజ్ చెయ్యాల్సిన బాధ్యత మనకి వుంది కాబట్టి అన్నీ బాగున్నాయనే చెప్తాం. కానీ, ఈ సినిమా టీజర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్‌కి ఇది ఫస్ట్ మూవీ అయినప్పటికీ చాలా బాగా తీశాడు. సినిమాలో విషయం వుందనే విషయం టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈమధ్యకాలంలో దెయ్యాల ట్రెండ్ బాగా నడుస్తోంది. నేను కూడా చంద్రకళ, పిశాచి వంటి దెయ్యాల సినిమాలు తెలుగులో చేశాను. నెక్స్‌ట్ చేస్తున్న మయూరి కూడా దెయ్యం సినిమాయే. ఈ సినిమా విషయానికి వస్తే హిట్ కళ కనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.
కొడాలి వెంకటేశ్వరరావు: ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారని ప్రోమోస్ చూసినా, మేకింగ్ వీడియో చూసినా అర్థమవుతుంది. ఎంతో ఖర్చుపెట్టి తీసిన సినిమాలు కూడా ప్రమోషన్ సరిగ్గా లేక కమర్షియల్‌గా సక్సెస్ అవడం లేదు. ఈ విషయంలో ఈ చిత్ర నిర్మాత జాగ్రత్త పడి మంచి ప్రమోషన్‌తో సినిమాని జనంలోకి తీసుకెళ్తే తప్పకుండా మంచి ఫలితం వుంటుంది. ఈ ఆడియోను హేమాస్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తున్న సురేష్ మాకెంతో కావాల్సినవాడు. చిన్న సినిమాల ఆడియో రిలీజ్ చేస్తూ, ఆ సినిమాల రిలీజ్‌కి ఎంతో కృషి చేస్తున్నాడు. ఒక మంచి సినిమా తీసే ప్రయత్నం చేసిన దర్శకనిర్మాతలకు ఈ సినిమా పెద్ద హిట్ అయి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.
పన్నా రాయల్: ఒక రియల్ ఇన్సిడెంట్‌ని తీసుకొని చేసిన కథ ఇది. ఈ సినిమాని 16 నెలలు కష్టపడి చేశాం. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాం. వచ్చేవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాగా లేదని ఏ ఒక్కరు చెప్పినా నేను డైరెక్షన్ చేయడం మానేసి నా గ్రాఫిక్ ఫీల్డ్‌లోకి వెళ్ళిపోతాను. ఈ కథ తీసుకొని చాలా మంది హీరోల దగ్గరికి వెళ్ళాను. కానీ, బడ్జెట్ విషయంలో కుదరక సినిమా చెయ్యలేకపోయాను. మా నిర్మాత అనూద్‌గారు మాత్రం ఏం టెన్షన్ పడకుండా సినిమా చెయ్యమని ఎంకరేజ్ చేశారు. ‘కాలింగ్ బెల్ 2’ చెయ్యడానికి కూడా తాను రెడీగా వున్నానని చెప్పడంతో ఈ సినిమా మీద నా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది.
కె.సురేష్‌బాబు: పన్నారాయల్, అనూద్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాలన్న వారి తపన చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. ఇలాంటి మంచి సినిమా ఆడియో మా హేమాస్ మీడియా ద్వారా రిలీజ్ చేయడం చాలా ఆనందాన్ని కలిగించింది. పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. సినిమా కూడా డెఫినెట్‌గా అందరికీ నచ్చేలా వుంటుంది. ఈ సినిమా పోస్టర్ మా ఇంట్లో పెడితే మా పిల్లలు కూడా భయపడుతున్నారు. పిల్లల మీద ఇలాంటి ఇంపాక్ట్ వచ్చిందంటే తప్పకుండా ఈ సినిమా అందర్నీ అలరిస్తుందన్న నమ్మకం కలిగింది.
రవివర్మ, కిషోర్, మమత రహుత్, వ్రితి ఖన్నా, సంకీర్త్, నరేష్ కావేటి, జీవా, నల్ల వేణు, షకలక శంకర్, జబర్దస్త్ చంటి, వంశీ, లక్కీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సుకుమార్. పి, కెమెరా: వివెక్ ఎస్. కుమార్, ఎడిటర్: దీపు, డైలాగ్స్: వెంకట్ బాల గొని, పవన్ మద్యల, స్టిల్స్: పి. నాగరాజు, లిరిక్స్: వెంకట్ బాలగొని, బండి సత్యం, నిర్మాత: షేక్ అన్వర్ బాషా (అనూద్), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్ (పవన్)