బలుపు, పవర్ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, మిల్కి బ్యూటి తమన్నా, స్మైలింగ్ సుందరి రాశి ఖన్నాలు కధానాయికలుగా, రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న బెంగాల్ టైగర్. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ఉత్తమాభిరుచి వున్న చిత్రాల్ని అందించిన నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 14 తో ఒ షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది. ఏప్రిల్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుని వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్ 18న విడుదల చేయటానికి నిర్మాత సన్నాహలు చేస్తున్నారు.
నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ.... మా బ్యానర్ లో మాస్‌మహరాజ్ రవితేజ హీరోగా బెంగాల్ టైగర్ ని భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం . సూపర్ సక్సస్‌ఫుల్ దర్శకుడు సంపత్ నంది ని మా బ్యానర్ లో మెదటిగా పరిచయం చేసాము. ఇప్పుడు ఆయన కాంబినేషన్‌లో రెండో చిత్రం ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా బెంగాల్ టైగర్ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. అందాల భామలు తమన్నా, రాశిఖన్నా లు రవితేజతో జోడీ కడుతున్నారు. అత్తారింటికి దారేది చిత్రం తరువాత బాలీవుడ్ నటుడు బోమన్ ఇరాని ఎన్నో కథలు విన్నాకూడా ఎంతో సెలక్టివ్ గా వుండే ఆయన మా చిత్రంలో చేస్తున్నారు. బోమన్ ఇరానితో పాటు రావు రమేష్, షియాజి షిండే, నాజర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదితరులు ఈ షెడ్యూల్ లో నటించారు. ప్రస్తుతం మార్చి 14 తొ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని, ఏప్రిల్ 9 నుంచి రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకుంటాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వినాయకచవితి సంధర్బంగా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహలు చేస్తు్న్నాం. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అని అన్నారు.
దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ... మాస్ మహరాజ్ రవితేజతో ,సినిమాల మీద ఉత్తమాభిరుచున్న నిర్మాత కె కె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. . ఆయన ఏవిషయంలో కూడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్తారింటికి దారేది లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించిన బాలీవుడ్ బెస్ట్ ఆర్టిస్ట్ బోమన్ ఇరాని రెండవ చిత్రంగా మా చిత్రం లో ప్రస్తుతం నటిస్తున్నారు. ఏప్రిల్ 9 నుండి తదుపరి షూటింగ్ షెడ్యూల్ చేస్తాము. సెప్టెంబర్ 18న విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము. అని అన్నారు.
ఈ చిత్రలో మాస్‌మహరాజ్ రవితేజ, తమన్నా, రాశిఖన్నా, బోమన్ ఇరాని, రావు రమేష్, షియాజి షిండే, నాజర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదితరులు ఈ షెడ్యూల్ లో నటించగా..
బ్యానర్..శ్రీ సత్యసాయి ఆర్ట్స్ కెమోరా.. సుందర్ రాజన్, ఎడిటర్.. గౌతమ్‌రాజు, ఆర్ట్.. డి,వై.సత్యనారాయణ, ఫైట్స్.. రామ్-లక్ష్మణ్, నిర్మాత..కె.కె.రాథామెహన్, కథ-మాటలు-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం.. సంపత్ నంది