Advertisementt

ఈరోజు నుంచి నాగార్జున, కార్తీల చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌

Mon 16th Mar 2015 04:46 AM
nagarjuna,karthi,vamsi paidipally pvp cinema,gopi sunder,sruthi haasan,prasad v. potluri  ఈరోజు నుంచి నాగార్జున, కార్తీల చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌
ఈరోజు నుంచి నాగార్జున, కార్తీల చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌
Advertisement
Ads by CJ

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ హీరోలుగా సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ పి.వి.పి. పతాకంపై మున్నా, బృందావనం, ఎవడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన వంశీపైడిపల్లి కాంబినేషనేషన్‌లో ప్రసాద్‌.వి.పొట్లూరి ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ ఈరోజు(మార్చి 16) ప్రారంభమైంది. హైదరాబాద్‌, చెన్నైలతోపాటు విదేశాలలో కూడా ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా తమిళ వెర్షన్‌కి సంబంధించిన పూజా కార్యక్రమాలు మార్చి 15న చెన్నెలో జరిగాయి. 

ఈ కార్యక్రమంలో వినయ్‌, రాజీవ్‌ కామినేని, వి.ఆర్‌.ఆరసు, పి.వి.పి.ప్రతినిధి కణ్ణన్‌, ఫోర్‌ ఫ్రేమ్స్‌ కళ్యాణ్‌, సీనియర్‌ యాక్టర్‌ శివకుమార్‌, సీనియర్‌ నటి జయసుధ, వంశీపైడిపల్లి, నటుడు మనోబాల, మ్యూజిక్‌ డైర్టెర్‌ గోపిసుందర్‌ సహా చిత్రయూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. తొలి సన్నివేశానికి సీనియర్‌ యాక్టర్‌ శివకుమార్‌ క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా...

హీరో కార్తీ మాట్లాడుతూ ‘‘నేను తమిళ్‌లో చేసిన సినిమాలన్నీ తెలుగులో కూడా పెద్ద హిట్‌ అయ్యాయి. నేను ఫస్ట్‌ టైమ్‌ తెలుగులో చేస్తున్న స్ట్రెయిట్‌ మూవీ తమిళ్‌లో కూడా నిర్మించడం హ్యాపీగా వుంది. తెలుగులో నా ఫస్ట్‌ మూవీ నాగార్జునగారులాంటి పెద్ద హీరోతో, పివిపి లాంటి పెద్ద సంస్థలో చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా తప్పకుండా తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది’’ అన్నారు.

సంగీత దర్శకుడు గోపిసుందర్‌ మాట్లాడుతూ ‘‘బెంగుళూర్‌ డేస్‌ చిత్రాన్ని పివిపిగారు రైట్స్‌ తీసుకొని ఆ చిత్రంలోని మ్యూజిక్‌ ఆయనకు బాగా నచ్చడంతో తెలుగులో కూడా సంగీతం చేసే అవకాశం నాకే ఇచ్చారు. నాగార్జునగారు, కార్తీగారు చేస్తున్న ఈ సినిమాతో తెలుగు, తమిళంలో నాకు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నాను’’ అన్నారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘‘నాగార్జునగారు, కార్తీగారు ఈ సినిమా చేయడానికి అంగీకరించడమే సగం విజయం లభించినట్టు ఫీల్‌ అవుతున్నాను. ఈ కథకు నాగార్జునగారు, కార్తీగారు హండ్రెడ్‌ పర్సెంట్‌ పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతారు. నాగార్జునగారితో నేను చేస్తున్న తొలి సినిమా ఇది. అలాగే కార్తీగారు ఫస్ట్‌ టైమ్‌ తెలుగులో చేస్తున్న స్ట్రెయిట్‌ మూవీకి నేను దర్శకత్వం వహించడం హ్యాపీగా వుంది. నామీద నమ్మకంతో చిత్రం ద్వారా తమిళ్‌లో నన్ను డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్‌ చేస్తున్న పివిపిగారికి థన్యవాదాలు. పివిపిలాంటి పెద్ద సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందన్న నమ్మకం నాకు వుంది’’ అన్నారు. 

శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. చాలా కాలం తర్వాత సీనియర్‌ నటి జయసుధ తమిళంలో నటిస్తుండటం విశేషం.  

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, శృతిహాసన్‌, జయసుధ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ఇంకా చాలా మంది ప్రముఖ నటీనటులు ఇతర పాత్రలు పోషిస్తారు. ‘మనం’లాంటి సూపర్‌హిట్‌ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన పి.ఎస్‌.వినోద్‌ ఈ చిత్రానికి కూడా ఫోటోగ్రఫీ చేస్తున్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: గోపిసుందర్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, మాటలు: అబ్బూరి రవి, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్‌, ఎడిటింగ్‌: శ్రీకరప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, నిర్మాత: ప్రసాద్‌ వి.పొట్లూరి, స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: వంశీ పైడిపల్లి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ