Advertisementt

ఉగాది కానుకగా 'జెండాపై కపిరాజు'

Mon 16th Mar 2015 04:50 AM
hero nani,amala paul,jendapai kapiraju on 21st march,samudrakhani,g.v.prakash kumar  ఉగాది కానుకగా  'జెండాపై కపిరాజు'
ఉగాది కానుకగా 'జెండాపై కపిరాజు'
Advertisement
Ads by CJ

నాని , అమలా పాల్ , రాగిణి ద్వివేది హీరో హీరోయిన్స్ గా శంబో శివశంబో వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన సముద్రఖని దర్శకత్వం లో, పి .  రామ్మోహన్ రావు సమర్పణలో, మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్  ప్రై లి. పతాకం పై రజత్ పార్థసారధి, కె . ఎస్.  శ్రీనివాసన్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం జెండా పై కపిరాజు. ఈ చిత్రం  ఈనెల 21 న ఉగాది కానుకగా విడుదల కానున్న సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం లో నిర్మాతలు మాట్లాడుతూ ..  "నాని ద్విపాత్రాభినయం చేసిన మొదటి సినిమా ఇది. అవినీతి పై పోరాటం చేసే కథానాయకుడిగా ఒక పాత్రలో నాని కనిపిస్తాడు,  ప్రతి వ్యక్తి తనను తానూ సంస్కరిచుకుంటే చాలు దేశాన్ని సంస్కరించి నట్లే అనే పాయింట్ తో రూపొందిన సినిమా ఇది.   నాని కెరీర్ లో భారి స్తాయిలో నిర్మించిన  వైవిధ్యమైన  సినిమా.    నాని ఈ సినిమాకోసం చాల హార్డ్ వర్క్ చేసాడు.  సామజిక ఇతివృత్తాన్ని వినోదబరితంగా   దర్శకుడు  సముద్ర ఖని  తెరకెక్కించాడు .  తప్పకుడా ఈ సినిమా మంచి విజయం సదిస్తుందన్న నమ్మకం ఉంది" అన్నారు.  

నాని , అమలా పాల్ , రాగిణి ద్వివేది , ప్రత్యెక పాత్రలో  శరత్ కుమార్ , శివబాలాజీ , వెన్నెల కిషోర్ , ఆహుతి ప్రసాద్ , తనికెళ్ళ భరణి, ధనరాజ్  తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : శశాంక్ వెన్నెలకంటి, మ్యూజిక్ - జి వి ప్రకాష్ కుమార్,  నిర్మాతలు - రజత్ పార్ధ సారది, కె ఎస్ శ్రీనివాసన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - సముద్ర ఖని. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ