Advertisementt

డి.వి. సినీ క్రియేషన్స్ లో వర్మ పెళ్లి పిలుపు!

Wed 18th Mar 2015 10:19 AM
dv cine creations,rgv,ram gopal varma,pelli pilupu,365 days movie,dv cine creations movie matter  డి.వి. సినీ  క్రియేషన్స్  లో వర్మ పెళ్లి పిలుపు!
డి.వి. సినీ క్రియేషన్స్ లో వర్మ పెళ్లి పిలుపు!
Advertisement
Ads by CJ

రామ్ గోపాల్ వర్మ పెళ్లి పిలుపు
D.V.CINE CREATIONS
నిఖిత శ్రీ  సమర్పణలో  డి.వి. సినీ  క్రియేషన్స్ పతాకం పై  డి. వెంకటేష్  ఈ సంవత్సరం లో మూడు సినిమాలు నిర్మించబోతున్నారు.  దీనిలో భాగంగా  ఆయన మొదట నిర్మించిన చిత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో  “365 days”. ఈ సినిమా రిలీజ్ కాగానే వెంటనే రామ్ గోపాల్ వర్మ తో  మరో సినిమా కూడా మే నుంచే ప్రారంభి౦చబోతున్నారు...ఈ  రెండు కాకుండా మరో  ఫీల్ గుడ్ లవ్ స్టొరీ  స్క్రిప్ట్  పై కూడా  ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి ........
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి. వెంకటేష్ మాట్లాడుతూ "రామ్ గోపాల్ వర్మ గారి మొత్తం కెరియర్ లో ఎక్కువగా వయలెంట్  సినిమాలు,హర్రర్ సినిమాలు, యాక్షన్  ధ్రిల్లర్లు  తీశారు . అడపాదడపా  రంగిలా , మస్త్, ప్రేమకథ లాంటి.... లవ్ స్టోరీలు తీసినా   వాటిల్లో ఒక వయలెంట్  బ్యాగ్రౌండో  లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటి  ఒక  ఫాంటసీ  బ్యాగ్రౌండో  వుండేది , కానీ 365 days లో నాకు విపరీతంగా  నచ్చిన అంశం ఏంటంటే” వర్మ గారు తన 25 ఏళ్ల  కెరియర్ లో  100% పూర్తి లవ్ & రొమాంటిక్ చిత్రం ఇదే మొట్టమొదటి సారి తీయటం "
వర్మ సినీ జీవితం లో ఫస్ట్ టైమ్ ప్యూర్  లవ్ & మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా  రూపొందిన “365 days” పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.... చిత్రం చూసినవాళ్లు “365 days”  చిత్రకథ  ప్రతి ప్రేమజంటకి & ప్రతి పెళ్ళైనజంటకి కూడా కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు. “365 days”  ఒక్క రామ్ గోపాల్ వర్మ పెళ్లి కధే  కాదు .....ప్రతి ఒక్కరి ప్రేమ కథ. & ప్రతి ఒక్కరి పెళ్లి కథ. ఈ అందమైన పెళ్లి కథకు ప్రేక్షకులందరూ కదలి రావాలని రామ్ గోపాల్ వర్మ పిలుపు నివ్వబోతున్నారు.  ఈ చిత్రం తాలూకు ఒక ట్రైలర్ ని, ఒక పాటని ఈ నెల 21 న రిలీజ్ చేయబోతున్నాం..' అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ