మైత్ర్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. ఇందులో శృతి హసన్ కథానాయికగ నటిస్తోంది. పూర్ణ ఓ ఐటెం సాంగ్ లో కనిపించనుంది ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. శ్రీమంతుడు టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాను జూలై 17న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు,
ఇదిలా ఉంటే తనకు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి హిట్ సినిమా ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలతో 'బ్రహ్మోత్సవం' సినిమా చేసేందుకు అంగీకరించాడు మహేష్. ఇది కాకుండా వైజయంతి మూవీస్ బానర్లో అశ్వినిదత్ నిర్మాణంలో మరో సినిమా చేయాల్సి ఉంది. దీనికి పూరి జగన్నాథ్ దర్శకుడని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుండి ప్రారంభంకానుందని చిత్ర యూనిట్ నుండి సమాచారం.