గోపీచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్‌గా యువి క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణకుమార్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జిల్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 27న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో గోపీచంద్, హీరోయిన్ రాశిఖన్నా, దర్శకుడు రాధాకృష్ణకుమార్, నిర్మాతలు వంశీ, ప్రమోద్, ఈ చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేస్తున్న దిల్‌రాజు పాల్గొన్నారు. దిల్‌రాజు ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..
దిల్‌రాజు: ప్రభాస్ సహకారంతో వంశీ, ప్రమోద్ యువి క్రియేషన్స్ సంస్థను స్థాపించి కొరటాల శివను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ నిర్మించిన ‘మిర్చి’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రెండో చిత్రం ‘రన్ రాజా రన్’ ద్వారా కూడా కొత్త డైరెక్టర్‌ని పరిచయం చేశారు. ఇప్పుడు మూడో చిత్రం ‘జిల్’ చిత్రంతో రాధాకృష్ణకుమార్‌ని దర్శకుడుగా పరిచయం చేస్తున్నారు. మా బేనర్ ప్రారంభించిన తర్వాత మొదట్లో నేను కొత్త డైరెక్టర్స్‌ని ఎలాగైతే ఎంకరేజ్ చేశానో అదే పద్ధతిలో వంశీ, ప్రమోద్ కూడా వెళ్తున్నారు. సినిమాకి ఏది కావాలో అది ప్రొవైడ్ చేస్తూ బడ్జెట్ విషయంలో వెనకాడకుండా కష్టపడి మంచి సినిమాలు చేస్తున్నారు. మంచి కథ, మంచి హీరో దొరికితే పెద్ద హిట్ సినిమాలు చెయ్యొచ్చని ప్రూవ్ చేస్తున్నారు. కథని నమ్మి గోపీచంద్ సినిమాలు చేస్తున్నాడు. యాక్షన్ ఇమేజ్ వున్న గోపీచంద్ లౌక్యంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా దగ్గరయ్యాడు. ఈ చిత్రంలో చాలా యూత్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. ఈ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ బేనర్‌కి హ్యాట్రిక్ మూవీ అవుతుంది.
రాధాకృష్ణకుమార్: కొత్త ఐడియాని ఎంకరేజ్ చేయడంలో ఈ చిత్ర నిర్మాతలు ముందుంటారు. సినిమా బాగా వచ్చింది. దానికి నిర్మాతల సహకారం ఎంతో వుంది. అలాగే మ్యూజిక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా ట్రెండీగా వుండే సాంగ్స్ చేశాడు జిబ్రాన్. సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందని నా నమ్మకం.
రాశిఖన్నా: నేను ఎలాంటి క్యారెక్టర్ చెయ్యాలని అనుకున్నానో అలాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో నాకు వచ్చింది. నాకు తప్పకుండా మంచి పేరు తెచ్చే క్యారెక్టర్ ఇది. గోపీచంద్‌గారు అమేజింగ్ కోస్టార్. జిబ్రాన్ చేసిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది.
గోపీచంద్: ప్రభాస్ నాకు ఫ్రెండ్ అయినప్పటి నుంచి వంశీ, ప్రమోద్ నాకు తెలుసు. ఇది నా ఓన్ మూవీలా భావిస్తున్నాను. నేను హీరో, వాళ్ళు ప్రొడ్యూసర్స్‌లా కాకుండా చాలా ఓపెన్‌గా స్టోరీ గురించి డిస్కస్ చేసేవాళ్ళం. చాలా హెల్దీగా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేశాం. రాధాకృష్ణ ఈ స్క్రిప్ట్‌ని సంవత్సరంన్నర కష్టపడి రెడీ చేశాడు. దాన్ని మించి సినిమా తీశాడు. డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత నేను చాలా శాటిస్‌ఫై అయ్యాను. హీరోయిన్ రాశి చాలా అందంగా కనిపిస్తోంది. ఊహలు గుసగుసలాడే చిత్రం కంటే ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్‌గా యాక్ట్ చేసింది. భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది. జిబ్రాన్ చేసిన మ్యూజిక్ ఆల్రెడీ పెద్ద హిట్ అయింది. ఆడియోపరంగా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందన్న నమ్మకం వుంది.