నాని ద్విపాత్రాభినయంతో అమలా పాల్, రాగిణి ద్వివేది హీరోయిన్లుగా వాసన్స్ విజువల్ వెంచర్స్ సమర్పణలో మల్టీ డైమెన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సముద్రఖని దర్శకత్వంలో రజిత్ పార్థసారధి, కె.ఎస్.శ్రీనివాసన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘జెండాపై కపిరాజు’. ఉగాది కానుకగా మార్చి 21న విడుదలైన ఈ చిత్రాన్ని సూపర్‌హిట్ టాక్ రావడంతో మార్చి 23న ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మల్టీడైమెన్షన్ వాసు, వాసన్ విజువల్ వెంచర్స్ శివ, హీరో నాని, నటుడు శివబాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
వాసు: ఉగాది కానుకగా 440 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరూ చాలా సహకరించారు. సంవత్సరంనర పాటు నాని వేరే ఏ సినిమాను ఒప్పుకోకుండా కేవలం ఈ సినిమా మీదే కాన్సన్ ట్రేట్ చేసాడు. సాయికార్తిక్ అధ్బుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. నాని నటించిన మాస్ సినిమాలలో హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమా ఇదే. సినిమా కలెక్షన్స్ కూడా చాలా బావున్నాయి.
శివ: తమిళంలో 30 కి పైగా సినిమాలను చేసిన మా సంస్థ తెలుగులో మొదటి సారిగా ‘జెండాపై కపిరాజు’ సినిమాతో అడుగుపెట్టాం. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు.
నాని: నా రెండు సినిమాలు ఒకేరోజు విడుదలవుతున్నాయని చాలా టెన్షన్ పడ్డాను. కాని ఈరోజు సినిమాలకు వచ్చిన స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉంది. ‘జెండాపై కపిరాజు’ అన్ని ఎలిమెంట్స్ కలగలిపిన కమర్షియల్ సినిమా. సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేసి బాగా నటించావు అని చెప్తుంటే నా ఆనందానికి అవధుల్లేవు. మాస్ హీరోగా కూడా నన్ను ఆదరించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు.
శివబాలాజీ: కరెక్ట్ ప్లాన్ వల్లే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. నాని కెరీర్ లో ‘జెండాపై కపిరాజు’ బెస్ట్ ఫిలింగా నిలిచిపోతుంది.