Advertisementt

బాలయ్య టైటిల్‌ వివాదం.!!

Sat 28th Mar 2015 01:01 AM
balakrishna lion movie,nandamuri balakrishna,balakrishna 99 movie,balakrishna new movie  బాలయ్య టైటిల్‌ వివాదం.!!
బాలయ్య టైటిల్‌ వివాదం.!!
Advertisement
Ads by CJ



నందమూరి బాలకృష్ణ తన 98వ సినిమా ‘లయన్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు.  సత్యదేవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రుద్రపాటి రమణారావు నిర్మాత. బాలయ్య పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ సినిమాను సమ్మర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ పక్క బాలయ్య తన 99వ సినిమా పనులు కూడా వేగవంతం చేశారు. ‘లౌక్యం’ వంటి సూపర్‌హిట్‌ సినిమాతో విజయపధంలో ఉన్న శ్రీవాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఇరోస్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ నిర్మింబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్‌  కార్యక్రమాలు పూర్తయితే మే నెలలో షూటింగ్‌ ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య సరసన నయనతార నటించబోతుందని సమాచారం. ఈ సినిమాకు నయన్‌ అంగీకరిస్తే బాలయ్యతో హ్యాట్రిక్‌ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాకు ‘డిక్టేటర్‌’ టైటిల్‌ పరిశీలనలో ఉంది.

ఓ పక్క లయన్‌ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతుంటే ఆ సినిమా టైటిల్‌ నాదంటూ ఓ చిన్న నిర్మాత వివాదానికి దిగారు. నిజానికి ఆ టైటిల్‌ తెలంగాణ ఫిలిం ఛాంబర్‌లో ఆ చిన్న నిర్మాతే మొదట రిజిస్ట్రేషన్‌ చేశారు అనడానికి ఆధారాలున్నాయని తెలుస్తోంది. బాలయ్య ‘లయన్‌’ తాలుక చిత్ర యూనిట్‌ చిన్న సినిమా ‘లయన్‌’ ప్రమోషన్‌లో అడ్డు పడుతున్నారని కూడా ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. అయితే పెద్ద సినిమా బరితో ఈ చిన్న నిర్మాత ఏ మాత్రం నెగ్గుకొస్తారో చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ