Advertisementt

గోదారిలో వరుణ్ తేజ్ జాతర!

Thu 02nd Apr 2015 06:18 AM
varun tej,godavari,krishna,jathara,kanche  గోదారిలో వరుణ్ తేజ్ జాతర!
గోదారిలో వరుణ్ తేజ్ జాతర!
Advertisement
Ads by CJ

క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'కంచె' చిత్రం షూటింగ్ పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలో జరుగుతుంది. 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. బుధవారం నాడు హీరో హీరోయిన్లపై పల్లెటూరి వాతావరణం నేపధ్యంలో ఓ జాతర పాటను, కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. వరుణ్ తేజ్ సరసన ఈ చిత్రంలో 'మిర్చి లాంటి కుర్రాడు' ఫేం ప్రజ్ఞ జైశ్వాల్ కథానాయికగా నటిస్తుంది. వరుణ్ తేజ్ తొలి చిత్రం 'ముకుంద' షూటింగ్ ఎక్కువ భాగం గోదావరి జిల్లాలోనే జరిగింది.  

చారిత్రాత్మక నేపధ్యంలో స్వాతంత్ర్య సమరయోధుల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజీవ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ