Advertisementt

మేలో అమెరికాలో ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’

Thu 02nd Apr 2015 09:18 AM
saidharam tej,subramanyam for sale,harish shankar,regina,adha sharma  మేలో అమెరికాలో  ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’
మేలో అమెరికాలో ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా గ్లామరస్‌ రెజీనా హీరోయిన్‌గా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై హరీష్‌శంకర్‌.ఎస్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’. ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్‌ అమెరికాలో జరగనుంది. 

ఆ విశేషాలను నిర్మాత దిల్‌రాజు తెలియ జేస్తూ ‘‘ఈ చిత్రానికి సంబంధించి కోకా పేట్‌ హౌస్‌లో 20 రోజులుగా నాన్‌స్టాప్‌గా షెడ్యూల్‌ జరుగుతోంది. దీని తర్వాత మేలో అమెరికా షెడ్యూల్‌ వుంటుంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని ఇంపార్టెంట్‌ సీన్స్‌, సాంగ్స్‌ తియ్యడం జరుగుతుంది. ‘పిల్లా నువ్వు లేని జీవితం వంటి సూపర్‌హిట్‌ తర్వాత సాయిధరమ్‌తేజ్‌ చేస్తున్న ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రం కూడా ఎంతో వైవిధ్యంతో కూడిన కథ. సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వస్తోంది. హరీష్‌ శంకర్‌ చాలా బాగా తీస్తున్నారు. ఈ చిత్రం తప్పకుండా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది’’ అన్నారు. 

సాయిధరమ్‌తేజ్‌, రెజినా, అదాశర్మ, సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావురమేష్‌, పృథ్వి, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, వెంకట్‌, ఆర్ట్‌: రామకృష్ణ, స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, సతీష్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, కో`ప్రొడ్యూసర్స్‌: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌ ఎస్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ