Advertisementt

బావ చేతుల మీదుగా బాలయ్య ‘లయన్‌’ ఆడియో!

Fri 03rd Apr 2015 07:36 AM
balakrishna,lion audio launch,april 9th,chandrababu naidu,nbk lion  బావ చేతుల మీదుగా బాలయ్య ‘లయన్‌’ ఆడియో!
బావ చేతుల మీదుగా బాలయ్య ‘లయన్‌’ ఆడియో!
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘లయన్‌’. రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారధ్యంలో జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్యదేవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతోండగా.. ‘లెజెండ్‌’ అనంతరం రాధికా ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటిస్తోంది. మణిశర్మ సంగీత సమకూర్చుతున్న ‘లయన్‌’ ఆడియోను ఏప్రిల్‌ 9న పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు సన్నాహాలు చేసుకొంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా విచ్చేయనున్న ‘లయన్‌’ ఆడియో విడుదల వేడుకను ‘శిల్పకళా వేదిక’లో నిర్వహించనున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు మాట్లాడుతూ... ‘మా నందమూరి నటసింహం బాలకృష్ణగారు త్వరలో ‘లయన్‌’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో బాలయ్యగారి పాత్రను దర్శకుడు సత్యదేవ మలిచిన తీరు, ఆయన చేత పలికించిన సంభాషణలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. బాలకృష్ణ`మణిశర్మ కాంబినేషన్‌లో వస్తున్న మరో మ్యూజికల్‌ సెన్సేషనల్‌ హిట్‌ ‘లయన్‌’. ‘లెజెండ్‌’ వంటి లెజెండరీ హిట్‌ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో నందమూరి అభిమానుల్లో ‘లయన్‌’ చిత్రంపై భారీ అంచనాలుండడం సహజమే. వారి అంచనాలను మించే స్థాయిలో ‘లయన్‌’ చిత్రం ఉండబోతోంది’ అన్నారు.

బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్స్‌గా పేర్కొనే` ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ చిత్రాల ఆడియోలకు నారాచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో విచ్చేసి` సదరు ఆడియోను విడుదల చేశారు, 

మళ్లీ ఇప్పుడు ఆయన మరోమారు ముఖ్యమంత్రిగా ‘లయన్‌’ ఆడియోను విడుదల చేయనున్నారు.

సో, సెంటిమెంట్‌ పరంగా చూసుకొంటే.. ‘లయన్‌’ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌ నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ