Advertisementt

ఏప్రిల్‌ 17న వరల్డ్‌వైడ్‌గా ‘ఉత్తమ విలన్‌’

Fri 03rd Apr 2015 11:17 AM
uttama villain on 17th april,kamal haasan,ramesh arvind,pooja kumar,parvati menon,ghibran  ఏప్రిల్‌ 17న వరల్డ్‌వైడ్‌గా ‘ఉత్తమ విలన్‌’
ఏప్రిల్‌ 17న వరల్డ్‌వైడ్‌గా ‘ఉత్తమ విలన్‌’
Advertisement
Ads by CJ

‘దశావతారం’, ‘విశ్వరూపం’ వంటి మెస్మరైజింగ్‌ చిత్రాల తర్వాత కమల్‌ హాసన్‌ చేస్తున్న మరో విలక్షణమైన చిత్రం ‘ఉత్తమవిలన్‌’. తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్‌ పిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్స్‌పై ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రై.లి.బ్యానర్‌పై సి.కళ్యాణ్‌ అందిస్తున్నారు. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్‌ 17న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతోది. 

ఈ సందర్భంగా సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మా ‘ఉత్తమ విలన్‌’ చిత్రాన్ని ఏప్రిల్‌ 17న విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ట్రైలర్‌ విడుదల చేసినప్పటి నుంచి సినిమా మీద ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. వారి ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగినట్టుగా సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంటుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో ‘ఉత్తమ విలన్‌’ మరో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది’’ అన్నారు. 

కమల్‌హాసన్‌, జయరామ్‌, కె.బాలచందర్‌, నాజర్‌, ఆండ్రియా, పూజా కుమార్‌, పార్వతి మీనన్‌,  పార్వతి నాయర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: కమల్‌హాసన్‌, సంగీతం: ఎం.జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌, ఎడిటింగ్‌: విజయశంకర్‌, సమర్పణ: తిరుపతి బ్రదర్స్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: జి.కుమార్‌బాబు, కోప్రొడ్యూసర్‌: సి.వి.రావు, నిర్మాత: సి.కళ్యాణ్‌, దర్శకత్వం: రమేష్‌ అరవింద్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ