కింగ్ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పి.వి.పి. పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్, ‘బృందావనం’ ‘ఎవడు’ చిత్రాల యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ సెకండ్ షెడ్యూల్ ఏప్రిల్ 9 నుండి హైదరాబాద్‌లో జరుగుతోంది. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో వేసిన భారీ సెట్‌లో ఈ చిత్రం కోసం నాగార్జున, కార్తీ, తమన్నా పాల్గొంటున్న ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది. తొలి షెడ్యూల్ చెన్నైలో జరిగింది. జూన్ నెలాఖరు వరకు జరిగే షెడ్యూల్స్‌తో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ ‘‘తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌లో నటించడం చాలా హ్యాపీగా వుంది. వంశీ ఎక్స్‌ట్రార్డినరీ సబ్జెక్ట్ చెప్పాడు. సబ్జెక్ట్ వినగానే వెంటనే ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించాను. ఈ సబ్జెక్ట్‌ని వంశీ చాలా బాగా డీల్ చేస్తున్నాడు. పి.వి.పి. చాలా పెద్ద లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది’’ అన్నారు.
కార్తీ మాట్లాడుతూ ‘‘తెలుగులో నేను చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ ఇది. నాగార్జునగారిలాంటి పెద్ద స్టార్‌తో కలిసి వర్క్ చేస్తున్నందుకు చాలా థ్రిల్‌గా వుంది. ఒకేసారి తెలుగు, తమిళ్ వెర్షన్స్ షూటింగ్ చెయ్యడం నాకు కొత్తగా ఎగ్జైటింగ్‌గా వుంది. చాలా మంచి కమర్షియల్ సినిమా ఇది’’ అన్నారు.
తమన్నా మాట్లాడుతూ ‘‘నాగార్జున, కార్తీలాంటి స్టార్స్‌తో కలిసి ఈ సినిమా చెయ్యడం వెరీ వెరీ హ్యాపీ. ఇందులో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా వుంటుంది’’ అన్నారు.
దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘‘మా కథకు హండ్రెడ్ పర్సెంట్ సూట్ అయ్యే నాగార్జునగారు, కార్తీలతో ఇంత భారీ మల్టీస్టారర్ చెయ్యడం చాలా చాలా హ్యాపీగా వుంది. పి.వి.పి. లాంటి పెద్ద సంస్థలో చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అయ్యేలా అద్భుతంగా రూపొందుతోంది’’ అన్నారు.
కింగ్ నాగార్జున, ‘ఆవారా’ కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా, సహజనటి జయసుధలతో పాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు సంగీతం: గోపీసుందర్, ఫొటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, మాటలు: అబ్బూరి రవి, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్, ఎడిటింగ్: శ్రీకరప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సునీల్‌బాబు, నిర్మాత: ప్రసాద్ వి. పొట్లూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.