Advertisementt

‘నువ్వేనా అది నీవేనా’ ప్లాటినమ్‌ డిస్క్‌ ఫంక్షన్‌

Thu 16th Apr 2015 01:56 AM
nuvvena adi neevena,rajkumar,harish rao,vamsi krishna,anusri,sri venkat  ‘నువ్వేనా అది నీవేనా’	ప్లాటినమ్‌ డిస్క్‌ ఫంక్షన్‌
‘నువ్వేనా అది నీవేనా’ ప్లాటినమ్‌ డిస్క్‌ ఫంక్షన్‌
Advertisement
Ads by CJ

వంశీకృష్ణ, అనుశ్రీ జంటగా సిలివేరి రమేష్‌బాబు సమర్పణలో ఆర్‌.కె. ఫిల్మ్‌ ఫ్యాకరీస్‌ పతాకంపై రాజ్‌కుమార్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘నువ్వేనా అది నీవేనా’. శ్రీవెంకట్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో ఇటీవల విడుదలై విజయం సాధించిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, జూపల్లి కృష్ణారావు,  చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నిర్మాత, ప్రతాప్‌ ఆర్ట్స్‌ అధినేత కె.రాఘవ, రాష్ట్రమంత్రి హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, కొప్పుల ఈశ్వర్‌లను చిత్ర యూనిట్‌ ఘనంగా సత్కరించింది. అనంతరం హరీష్‌రావు చేతుల మీదుగా చిత్రయూనిట్‌కి ప్లాటినమ్‌ డిస్క్‌లను అందించారు. ఈ సందర్భంగా..

హరీష్‌రావు: గోదావరిఖనికి చెందిన రాజ్‌కుమార్‌గారు దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా వుంది. సినిమా పరిశ్రమ తెలంగాణలో మరింత అభివృద్ధి చెందడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం, కె.సి.ఆర్‌.గారు సిద్ధంగా వున్నారు. సినిమాకి సంబంధించి లేటెస్ట్‌ టెక్నాలజీని అందించి డెవలప్‌ చేస్తాం. తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్‌ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్‌ చేసుకునే విధంగా కృషి చేస్తాం. దర్శక, నిర్మాతలకు ఇన్సెన్‌టివ్స్‌ ఇచ్చే విషయం గురించి ప్రభుత్వం ఆలోచిస్తోంది. 

కొప్పుల ఈశ్వర్‌: రాజ్‌కుమార్‌గారు దర్శకత్వం వహించిన నిర్మించిన ఈ సనిమా మంచి విజయం సాధించి ఆయనకి మంచి పేరుతోపాటు లాభాలు కూడా తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. 

జూపల్లి కృష్ణారావు: రాజ్‌కుమార్‌గారు ఒక మంచి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన్ని అభినందిస్తున్నాను. అతనికి, ఆయన టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్తున్నాను. 

దర్శక నిర్మాత రాజ్‌కుమార్‌: మా చిత్రం ఆడియోకి చాలా మంచి స్పందన వచ్చింది. సినిమాకి మంచి పాజిటివ్‌ టాక్‌ వుంది. ఒక మంచి సినిమా తియ్యడంలో ఆర్టిస్టులుగానీ, టెక్నీషియన్స్‌గానీ ఎంతో సహకరించారు. ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. 

ఎమ్‌.ఆర్‌.చౌదరి:  రాజ్‌కుమార్‌కి సినిమా అంటే ప్యాషన్‌. సినిమాయే అతని లోకం. ఎంతో కృషి చేసి ప్లాటినం డిస్క్‌ దశకు ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు. ఆడియో సక్సెస్‌ అయినట్టుగానే సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. 

శ్రీవెంకట్‌: మా సినిమా ఆడియో ఇంత మంచి విజయం సాధించడం ఆనందంగా వుంది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఆడియోలాగే సినిమా కూడా పెద్ద సక్సెస్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది.  

వరంగల్‌ శాస్త్రి, జగన్‌ నాయక్‌, సుమన్‌ శెట్టి, జబర్దస్త్‌ ఆనంద్‌, నివాస్‌ ఆనంతనేని, రోషన్‌, విజయ్‌, స్నేహ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ధరణి కోట శివరాంప్రసాద్‌, పాటలు: సంజయ్‌ గాంధీ, వెంకట్‌, సంగీతం: శ్రీవెంకట్‌, కెమెరా: ప్రసాద్‌, ఆర్ట్‌: డేవిడ్‌, డ్యాన్స్‌: పాలిక్‌, ఆఖిల్‌, సహనిర్మాత: బొల్లంపల్లి సాయిరమణ, రచన, నిర్మాత, దర్శకత్వం: రాజ్‌కుమార్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ