Advertisementt

లయన్‌ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌..!!

Thu 16th Apr 2015 09:47 AM
lion,release date,balakrishna,satyadev  లయన్‌ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌..!!
లయన్‌ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌..!!
Advertisement
Ads by CJ

'లెజెండ'్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా 'లయన్‌'. సత్యదేవ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా డైలాగులు, పాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు పోలీస్‌ క్యారెక్టర్‌లో బాలయ్య పర్‌ఫార్మెన్స్‌ అదుర్స్‌ అని ఈ సినిమా ప్రొమోస్‌ చూసిన అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సినిమా మే '1'న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఎప్పటినోంచు టాక్‌ నడుస్తోంది. అంతలోనే ఈ సినిమా విడుదల తేదీని ఒకరోజు ముందుకు జరిపారన్న వాదన కూడా వినిపించింది. దీంతో  ఈరెండు రోజుల్లో బాలయ్య చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలియక అభిమానులు తికమకపడ్డారు. ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ మే1వ తేదీని 'లయన్‌'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఈ సినిమా యూనిట్‌ నిర్ణయించుకుంది. ఇక కొత్త దర్శకుడు బాలయ్యను 'లయన్‌'లో ఎలా చూపించాడో తెలియాలంటే మే డే వరకు ఆగక తప్పదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ