Advertisementt

రామ్ చరణ్ హీరోయిన్‌కు మరో ఛాన్స్..!

Sat 18th Apr 2015 08:49 AM
neha sharma,ram charan heroine,chirutha,hera pheri 3  రామ్ చరణ్ హీరోయిన్‌కు మరో ఛాన్స్..!
రామ్ చరణ్ హీరోయిన్‌కు మరో ఛాన్స్..!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ 'చిరుత' సినిమాతో కథానాయికగా పరిచయమైన ముంబై మోడల్ నేహ శర్మ. తెలుగులో చిరుత తర్వాత మరో సినిమా 'కుర్రాడు' చేసి ముంబై చెక్కేసింది. హిందీ సినిమాలపై దృష్టి సారించింది. ఐదేళ్ళ సమయంలో హిందీలో ఐదు సినిమాలు మాత్రమే చేసింది. కెరీర్ పెద్ద హీరోల పక్కన అవకాశాలు రావడం లేదు, కెరీర్ క్లోజ్ అయిపోతుందనుకునే సమయంలో నేహా శర్మకు మంచి అవకాశం లభించింది. 

అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం హీరోలుగా నటిస్తున్న 'హేరా ఫెరి 3'లో హీరోయిన్‌గా ఎంపికైంది. ఆల్రెడీ దుబాయ్ లో జరిగిన షూటింగులో నేహా కొన్ని రోజులు పాల్గొంది. 'హేరా ఫెరి' ముందు రెండు భాగాలు హిట్టయ్యాయి. దాంతో, మూడవ భాగంపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా హిట్టయితే, నేహాకు మరో రెండు అవకాశాలు వస్తాయేమో చూడాలి. హిందీలో హీరోయిన్ల మధ్య తీవ్రమైన పోటి నెలకొంది, కొత్త భామలు వస్తుండడంతో పాత ముఖాలకు అవకాశాలు రావడం లేదు. అందుకే, తెలుగులో అవకాశాల కోసం ప్రయత్నిస్తుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ, నేహా మరో తెలుగు సినిమాకు సంతకం పెట్టలేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ