Advertisementt

‘క్రిమినల్స్‌’ టీజర్‌ లాంచ్‌

Mon 20th Apr 2015 02:01 PM
telugu movie criminals,osho tulasiram,ch.v.sharma,mantra anand,priyanka kothari  ‘క్రిమినల్స్‌’ టీజర్‌ లాంచ్‌
‘క్రిమినల్స్‌’ టీజర్‌ లాంచ్‌
Advertisement
Ads by CJ

‘మంత్ర’, ‘మంగళ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను రూపొందించిన ఓషో తులసీరామ్‌ దర్శకత్వంలో పి.ఎస్‌.ఆర్‌. ఫిల్మ్‌ కార్పోరేషన్‌ సమర్పణలో మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రియాంక కొఠారి ప్రధాన పాత్రలో పి.శ్రీనివాసరావు, సి.హెచ్‌.వి.శర్మ నిర్మిస్తున్న మరో విభిన్న చిత్రం ‘క్రిమినల్స్‌’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ లాంచ్‌ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, వెలిగొండ శ్రీనివాస్‌, ధన్‌రాజ్‌, హీరో కార్తీక్‌, మనోజ్‌ నందం, విజయ్‌సాయి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌ కొండాబత్తుల నాగశేఖర్‌, కాలే వెంకట సుబ్బారావు, చిత్ర దర్శకుడు ఓషో తులసీరామ్‌, నిర్మాతల్లో ఒకరైన సి.హెచ్‌.వి.శర్మ, నటులు వంశీ, రాయ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

విజయ్‌కుమార్‌ కొండా: ఈ చిత్ర నిర్మాత శర్మగారు నాకు ఒక రచయితగా తెలుసు. సినిమా అంటే ఆయనకు ప్యాషన్‌. సినిమాల్లో ఏదో చెయ్యాలని తపన. ఆ తపనే అతన్ని ప్రొడక్షన్‌ మేనేజర్‌ నుంచి ప్రొడ్యూసర్‌ స్థాయికి తీసుకొచ్చింది. తులసీరామ్‌ స్టోరీ డిస్కషన్స్‌లో ఎప్పుడూ సైలెంట్‌గా వుండేవాడు. అలా సైలెంట్‌గా వుంటూనే ‘మంత్ర’తో మమ్మల్ని భయపెట్టాడు. ఒక అందమైన అమ్మాయితో క్రూయల్‌గా మర్డర్స్‌ చేయిస్తారని ట్రైలర్స్‌ చూస్తుంటే తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నా నమ్మకం.

వెలిగొండ శ్రీనివాస్‌: శర్మ, నేను, తులసి ముగ్గురం మంచి స్నేహితులం. మంత్రతో పెద్ద హిట్‌ ఇచ్చిన తులసి మంగళతో కొద్దిగా తగ్గాడు. ఈ సినిమా హిట్‌ కొట్టి మళ్ళీ పైకి లేస్తాడు. అతను పెద్ద డైరెక్టర్‌ అవ్వాలని ఒక ఫ్రెండ్‌గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 

తుమ్మలపల్లి రామసత్యనారాయణ: ఒక సినిమా గురించి రకరకాలుగా ఆలోచిస్తాం. సినిమా బాగోదు, సినిమా లేట్‌ అయింది.. ఇలా రకారకాలుగా అనుకుంటాం. అయితే ఈ సినిమా మీద నాకు మంచి ఒపీనియన్‌ వుంది. ఎందుకంటే ఒక సూపర్‌హిట్‌, ఒక హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌. డెఫినెట్‌గా బాగా తీసి వుంటాడని నమ్మకం వుంది. శర్మగారు కూడా ఎంతో కష్టపడి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా డిలే అయిందని అంటున్నారు. ఎంత డిలే అయితే అంత క్వాలిటీగా సినిమా వస్తుంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.

కార్తీక్‌: ఒక మంచి సక్సెస్‌ కోసం చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్నాను. డబ్బు ముఖ్యం కాదు. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఒక ఆకలితో వుంటాం. తులసిగారు ఈ సినిమాతో అది తీర్చారు. ఈ సినిమా కోసం ఫిజికల్‌గా ఎంతో కష్టపడ్డాం. ఆ కష్టాన్ని ఎంతో ఇష్టంగా చేశాం. తప్పకుండా ఈ సినిమా మాకు పెద్ద సక్సెస్‌నిస్తుందనుకుంటున్నాను. 

ఓషో తులసీరామ్‌: ఈ సినిమాకి సంబంధించి పూర్తి భారం మోసింది ప్రియ. ఫస్ట్‌టైమ్‌ ఆమెను కలిసినపుడు లైన్‌ చెప్పాను. మనం చేద్దాం అన్నారు. ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ అయిన తర్వాత నాకు టెన్షన్‌ స్టార్ట్‌ అయింది. ఈ క్యారెక్టర్‌ని ప్రియ చేయగలదా? అంత భారం మోయగలదా అని డౌట్‌ వచ్చింది. కానీ, నేను ఊహించని విధంగా ఏది చెప్తే అది చేసింది. టూ హండ్రెడ్‌ పర్సెంట్‌ క్యారెక్టర్‌ న్యాయం చేసింది. ఇప్పుడు టీజర్‌ చూశారు. అందరూ బాగుందంటున్నారు. రేపు సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం నాకు వుంది.

ప్రియాంక కొఠారి: ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్‌ అవడం ఒక బ్యూటిఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఇంత మంచి అవకాశం ఇచ్చిన శర్మగారికి, తులసి సర్‌కి థాంక్స్‌. ఒక ఆర్టిస్టుగా ఇలాంటి సినిమా చేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇన్నోసెంట్‌గా వుండే ఒక అమ్మాయి ఆమె ట్రావెల్‌లో ఎలా క్రిమినల్‌గా మారిందనే మంచి కథతో చేసిన ఈ సినిమా తప్పకుండా మీ అందర్నీ అలరిస్తుంది. 

కొండాబత్తుల నాగశేఖర్‌: సినిమా అందరూ అనుకుంటున్నట్టుగానే లేట్‌ అయింది. దానికి తగ్గట్టుగానే క్వాలిటీ వుంటుంది. మేం అనుకున్నది అనుకున్నట్టుగా చేశాం. సినిమా పూర్తయ్యేవరకు యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో కోఆపరేట్‌ చేశారు. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలబడుతుంది. అది నేను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. 

ప్రియాంక కొఠారి, రవిబాబు, ఉత్తేజ్‌, కార్తీక్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: మంత్ర ఆనంద్‌, సినిమాటోగ్రఫీ: టి.జస్వంత్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కొండాబత్తుల నాగశేఖర్‌, కాలే వెంకట సుబ్బారావు, నిర్మాతలు: పి.శ్రీనివాసరావు, సి.హెచ్‌.వి.శర్మ, దర్శకత్వం: ఓషో తులసీరామ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ